Others

స్వాధ్యాయ సందోహం-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దాదాపుగా ఇదే భావాన్ని కఠోపనిషత్తు ‘తమ క్రతుః పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదా న్మహిమాన మాత్మనః’- ‘పరమేశ్వరుని కృపవలన నిష్కామ కర్మ సిద్ధి, తద్వరా సంసార సంబంధమైన శోకరాహిత్యం మరియు రాగద్వేషాలకు అతీతమైన చిత్తశుద్ధి కలిగిన మహాత్ములు మాత్రమే ఆత్మదర్శనం చేసుకోగలరు’’ అని వివరించింది.
మరి పరమేశ్వరుని కృప ఎలా సిద్ధిస్తుంది? అంటే భగవానుని ఎడల అనన్యమైన భక్తి మరియు దేని యెడల చిత్తచాంచల్యం లేక పరమ గురు స్వరూపమైన పరమాత్మునకు తనను తాను ఆత్మార్పణ చేసికొనడం ద్వారా మాత్రమేనని యోగదర్శనంలో పతంజలి మహర్షి..
‘ఈశ్వర ప్రణిధానాద్వా’
అని సూత్రీకరించాడు. మనస్సు ప్రేరణతో జ్ఞానేంద్రియాలు లౌకిక విషయాలకు ఆకర్షితమై ప్రవర్తింపనీయకుండుటయే చిత్తవృత్తి నిరోధమని చెప్పబడుతుంది. అట్టి చిత్తవృత్తి నిరోధమెప్పుడు, ఎవడికి సిద్ధిస్తుందో అప్పుడు అతనిలో హృదయ పద్మంలో ఉండే పరమాత్మ దర్శనం మరియు ఆయన దయ పరిపూర్ణంగా అతడికి లభ్యమవుతుంది. అటువంటి మహాత్ముడికి ఆత్మ చైతన్య జ్ఞానం కలిగి తద్వారా ఆధ్యాత్మిక పురోగతి ఎదురయ్యే సమస్య విఘ్నాలు తమంత తామే తొలగిపోతాయి- ‘తతః ప్రత్యక్చేతనాధిగమో- ప్యంతరాయాభావశ్చ’ అని పతంజలి హామీ ఇచ్చాడు.
ఈ విధంగా ఆత్మావలోకనం సిద్ధించాలంటే ఈశ్వరుని యెడల ప్రణిధానం (్భక్తి) కల్గియుండుమని పతంలి యోగదర్శనంలో ఎనె్నన్నో రీతులుగా చెప్పిన అంశాన్ని వేదం కోట్ల సంవత్సరాలకు పూర్వమే స్పష్టం చేసింది. తండ్రి తన పుత్రుడికి సర్వ విషయాలను మనసు విప్పి చెప్పుకుంటే పుత్రుడికి శ్రేయస్సు కలుగుతుందా? కాని మనుషులందరు మనస్సు ఉచ్చులో చిక్కుకుయి దాని నుండి బయటపడే ప్రయత్నమే చేయడంలేదు. మనస్సు తల్లి అయి ప్రకృతి కొంగుపట్టి విడవకుండా తిరుగుతూంది. బుద్ధిమాత్రం తండ్రిన పరమాత్ముని కనె్నత్తి కూడ చూడటంలేదు.
ఈశ్వరానుగ్రహానికి ఉపాయం
భగవంతుడు స్వభావం చేత దయాళువు. దీనికి ప్రమాణం ఆయన సృష్టించిన సృష్టియే. జీవులకు మేలు కలిగించేందుకు తప్ప దేవ దేవుడికి సృష్టిరచనకు మరో ప్రయోజనమేముంది? అట్టి పరమ దయాళువైన పరమాత్మ దయను చూరగొనడం కష్టమేమీ కాదు. కాబట్టి జీవులు చేయవలసినదేమంటే అంతఃకరణములను కేవలం ఆయన వైపునకు త్రప్పి ఉంచడమే. పరమేశ్వరుడు జీవులకు తల్లి- తండ్రి కూడ. ఆయన తన బిడ్డలైన జీవులు తన దిశకు తిరిగి చేతులు చాచితే వాత్సల్యముప్పొంగి అనంత శక్తివంతమైన తన చేతులను చాచి తన ఒడిలోనికి తీసుకొని ఆదరించకుండ ఉంటాడా?
భగవంతుడే నాకు సంరక్షకుడనే పరమ విశ్వాసంతో ప్రార్థన- స్తుతి- ఉపాసనలు చేయడం; ఆయన ఆదేశాలను తు.చ తప్పక ఆచరణలో పెట్టడం; ప్రాణ సమానమైన శరీరం- మనస్సు - ధనం అన్ని వెచ్చించి లోకోపకారం చేయడం; నిస్వార్థబుద్ధితో తోడివారికి సహాయపడడం;
సదా సత్కార్యాచరణ బుద్ధి వహించడం; సోమరిగాకుండుట; న్యాయం - దయ - ఉపకారం మొదలైన పరమేవ్వర గుణాలవను తానలవరించుకొనడం: లౌకిక విషయ వాసనలను విడిచి చంచల మనస్సును స్థిరంగా చేసి ధర్మార్థ కామ మోక్ష సాధన రూపమైన పురుషార్థ సాధనకు యత్నించడం మొదలైన వెనె్నన్నో జీవులు తమ మనస్సును దైవం వైపు త్రిప్పి ఉంచే సాధనాలు. వీనిని జీవులు తమవిగా చేసికొంటే దైవం కూడా వారిని తనవారిని చేసుకొంటుంది. అంటే వారిపైన దైవం తన కరుణామృతాన్ని వర్షిస్తుందన్నమాట.

..........................ఇంకావుంది