Others

శక్తితత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పురాణాలలో సూర్యకిరణాలను వర్ణించిన విధానంపై సిద్ధాంతానికి చాలా దగ్గరగా సంపూర్ణంగా సరిపోతోంది. మన పురాణ కథలన్నీ సంకేతార్థాలతో వుంటాయి యధాతథ వాక్యార్థాన్ని తీసుకోకూడదు. సూర్యరథం సప్తాశ్వాలతో లాగబడుతోందని చెప్పారు. అంటే సూర్య కిరణంలో ఏడు రంగులు (ఇంద్రధనుస్సు) వున్నాయి. ఆ గుఱ్ఱాలను పాముల పగ్గాలతో పట్టుకున్నాడని చెప్తారు. పాముల గమనం అలల గమనంవలె వుంటుంది. పాముల తోక దగ్గర సన్నగా తల దగ్గర లావుగా వుంటాయి. కాంతి కిరణాలు కూడా మొదట సన్నగా వుండి పోను పోను వెడల్పవుతాయని, తరంగాల ప్రవాహంవలె ప్రయాణిస్తాయని వ్యాఖ్యాతలు చెప్పారు. పోను పోను వెడల్పుగా అవుతాయి కనుక కాంతి కిరణాన్ని పృధుముఖమని అంటారు. పాముల తలలకుండే మణులే ఫోటాన్సుగా భావించే కాంతి అణుఖండాలని (శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారి సనాతన దేశంలో అధునాతన విజ్ఞానంలో) చెప్పారు. కాబట్టి సనాతన ఋషులకు కాంతి కిరణాల యొక్క పరావర్తనానికి సంబంధించిన విజ్ఞానం పూర్తిగా తెలుసునని మనం గ్రహించాలి.
ఒక అణువును తీసుకుని దానిలోని ఎలక్ట్రాన్ లేదా మరొక అణుఖండం యొక్క ఆవర్తన పరిధిని తిలకించి నిశ్చయించేలోపే దానియొక్క స్థితి సంక్షోభం (మార్పు) చెందుతోంది. కనుక దాని స్థితిని నిశ్చయంగా చెప్పలేం. గమనించకపోతే చెప్పలేం. గమనిస్తే అసలే చెప్పలేని అనిశ్చిత స్థితి. అందుకే ‘హైసన్‌బర్గ్’ తన సిద్ధాంతానికి అనిశ్చితవాదమని పేరు పెట్టాడు. ఈ సిద్ధాంతంవల్ల ప్రతి విషయాన్ని నిర్వచించి నిర్దుష్టంగా నిశ్చయంగా చెప్పగలమనే విజ్ఞానవాదుల అభిప్రాయానికి పెద్ద విఘాతం కలిగించింది. ఎలక్ట్రానుల యొక్క వెలాసిటీ (వేగం) గాని బరువుగాని ఎన్నో వందల రెట్లు మారిపోతున్న సమయంలో వాటి స్థితిని పరిశీలించి నిర్థారించడమెలా అన్న ప్రశ్న దగ్గరే ఎలక్ట్రాన్ యొక్క స్వరూప స్వభావాన్ని నిశ్చయంగా చెప్పడం సాధ్యంకాదని ‘హైసన్‌బర్గ్’ యొక్క అనిశ్చిత సిద్ధాంతం మనకు వివరిస్తోంది. ఎలక్ట్రాన్ తన యిష్టానుసారం సంచరిస్తుందే తప్ప ఒక నిశ్చితమైన నియమానుసారం చలించడంలేదని ష్రోడింగర్ అనే శాస్తవ్రేత్త నిరూపించాడు.
శక్తితత్త్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు భారతీయ సనాతన పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పిందేమిటంటే, శక్తి అనిర్వచనీయమని చెప్పారు. అనిర్వచనీయమనే పదం పైన చెప్పిన హైసన్‌బర్గ్ అనిశ్చిత సిద్ధాంతానే్న సంకేతిస్తోంది. సప్తశతిలో రుూ సృష్టి అంతా ఆదిశక్తి లేక పరాశక్తి నుండే వుత్పన్నమై లయవౌతోందని ఒక కథ చెప్పబడింది. అదేమిటంటే దేవాసుర సంగ్రామంలో దేవతలు రాక్షసుల చేతిలో అపజయం చెంది ఆదిశక్తిని శరణు కోరారు. అప్పుడు ఆదిశక్తి తనలోనుండి అనేక శక్తులను సృష్టించి భండాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. అప్పుడు భండాసురుడు నీకింత సైన్యం వుంది కాబట్టే గర్వంతో విఱ్ఱవీగుతున్నావు అంటాడు.
అప్పుడు ఆదిశక్తి చిద్విలాసంతో వీరంతా నా శక్తులే అని చెప్పి వారందరిని తనలో ఐక్యం చేసుకుని ఒకే శక్తిగా నిలబడుతుంది. ఇది పైకి కథగా కనిపించినా ఋషి ఉద్దేశ్యం వైజ్ఞానికమే. ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాయై’- భిన్నరూపాలుగా కనిపించే శక్తి పరిశీలించి చూస్తే ఒకటే శక్తితత్త్వమని స్పష్టం చేస్తున్నాడు ఋషి. విజ్ఞాన శాస్త్రం ప్రారంభంలో పదార్థం వేరు శక్తి వేరు అనుకుంది. ఆ రెండింటి గురించి తనకు తెలుసుననుకుంది. ‘ఐన్‌స్టీన్’ సిద్ధాంతంతో ఆ రెండు వేరు వేరు కాదని ఒకటేనని తేలింది. తరువాత ‘హైసన్‌బర్గ్’ సిద్ధాంతంతో పదార్థము- శక్తి వేరు కానప్పటికి, అవి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కొరకు పరిశోధన ప్రారంభమైంది. ఇక్కడే ‘అనిశ్చితవాద సిద్ధాంతం’ ( 1927 అన్‌సర్టైనిటి ప్రిన్సిపల్) ఆవిష్కృతమైంది. అంటే, ఈ పరిశోధనాక్రమము ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ పద్ధతిలో కొనసాగుతోందని స్పష్టమవుతోంది. కాబట్టి విశ్వానికి ఆధారమైన ఆదిశక్తి లేక పరాశక్తి నిత్య నిరంతర చైతన్య శీలమని, ఆ శక్తియొక్క రూపాలు అనంతమైనవని, ఆ శక్తి యిట్టిది అని వివరించ నలవికానిదనీ మన పురాణాలు వివరించిన విధానం వైజ్ఞానిక పరమైనది కాదని సత్యదూరమని ఎవ్వరూ అనలేరు.
..........................ఇంకావుంది

- డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590