Others

రామభక్తి - విభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ రాముడు రాక్షసాంతకుడు, రాముని వేడిన కామితంబులౌ
రాముని చేత వానరులు భ్రాజితులైరి యశోవిలాసులై
రాముని సేవకై తనదుప్రాణములిచ్చిన పక్షిరాజుకున్
నీమముతోడ సద్గతులనెన్నగగూర్చిన కోసలేంద్రుడౌ
రామునికంటె లోకమున రాజిలుదైవము లేడు లేడుగా!
రాముని యొక్క బాణముల రావణుడోడె జగద్ధితంబుగా
రామునియందు భక్తి సువిరాజిత జీవితమందజేయుచున్
హేమ ఫలంబులిచ్చు పురుషేశ్వర! ఓ రఘునాయకా! యనన్!
అల్లసాని వాని అల్లికకు కన్నడ కస్తూరీ పరిమళం
నిరపహతిస్థలంబు రమణీయప్రియ దూతిక తెచ్చి ఇచ్చుక
కప్పురవిడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచమొప్పుత
ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక ఊరకకృతుల్ రచియింపుమటన్న శక్యమే?
ఆహ్లాదకరమైన ఏకాంత ప్రదేశము, మనసుకు నచ్చిన భోజనము, లీలగా హేలగా ఊగుతూ ఉండటానికి ఊయల మంచము, చెపుతున్న విషయాన్ని వివేకంతో విచారించి, రచించి, వివరించే రసజ్ఞులైన లేఖక పాఠకులు- ఇవేవీ లేకుండా ఊరకే కవిత్వం రమ్మంటే ఎలా వస్తుందని శ్రీకృష్ణదేవరాయలవారిని పై పద్యంలో దబాయించి ప్రశ్నించినవాడు ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్ద కవీంద్రుడు. రాయలవారికి బాల్యమిత్రుడైనందువల్లే పెద్దన ఇంత చనువు తీసుకున్నాడేమో! ఈ పద్యం సాహితీ లోకంలో సుప్రసిద్ధం. నవ కవిత్వానికి ‘బందూకం సంధ్యారాగం, సింధూరం రక్తచందనం, పులి చంపిన లేడి నెత్తురూ’- శ్రీశ్రీ కావాలనేదాకా పెద్దనగారి పద్యం ‘హవా’ కొనసాగింది. అల్లసాని పెద్దనగారికి దాదాపు మూడు వందల ఏళ్ళ ముందువాడయిన కన్నడ కవి మల్లికార్జునుడు చెప్పిన ఈ పద్యాన్ని గమనించండి.
నిరుపతిస్థలం, మృదుకరాసన మెళ్లుణిసింపుదంబులం
నరపిద పుస్తక ప్రతతి, లేఖకవాచక సంగ్రహం, నిరం
తర గృహ నిశ్చితస్థితి, విచారక సంగతి, సత్కళత్రసా
దరతయు నుళ్ల సత్కవియు మీసువదాగదె కావ్యవర్థియుం!
పై తెలుగు, కన్నడ పద్యాలలో భావము, భాష ఛందస్సు దాదాపుగా ఒకటే (రెండూ చంపకమాలలే అయినప్పటికీ కన్నడంలో యతి నియమం ఉండదు). కాకపోతే కన్నడ కవి కళత్రం తోడుగా ఉండాలనుకుంటే, పెద్దనగారు మాత్రం ఈ సంసార జంజాటం పెట్టుకోకుండా ప్రియదూతిక ఉంటే చాలునన్నాడు.పెద్దనగారు కన్నడ కవిని అనుకరించారని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి ‘అనుకరణ అత్యున్నతమైన గౌరవం’. ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱనగారి మీద గౌరవంతో ‘అంబనవాంబుజోజ్జ్వల..’ పద్యాన్నీ, కేయూరబాహు చరిత్ర రచించిన మంచె మీద గౌరవంతో ‘బాల రసాల సాల..’ పద్యాన్నీ పోతన్నగారు స్వీకరించడం మనకందరికీ తెలిసిందే. ఇదే కోవలో పెద్దనగారు కూడా మల్లికార్జునుణ్ణి మనసులో ఉంచుకున్నాడనిపిస్తుంది.

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949