Others

పచ్చని కొండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని కొండలు
చుట్టూ ఉంటే
చల్లని గాలులు
హాయిగ వీచును

పచ్చని కొండలు
దరిలోనుంటే
కాయాకసరులు
కొల్లగ దొరుకును

పచ్చని కొండలు
చుట్టూ ఉంటే
వాగూ వంకలు
నిత్యం పారును

పచ్చని కొండలు
దరిలోనుంటే
నల్లని మబ్బులు
తరచుగ కమ్మును

పచ్చని కొండలు
చుట్టూ ఉంటే
వానల వరాలు
విరివిగ కురియును

పచ్చని కొండలు
దరిలోనుంటే
వీనుల విందులు
పక్షులు చేయును

పచ్చని కొండలు
చుట్టూ ఉంటే
పశువుల పొదుగులు
పాలతో నిండును

పచ్చని కొండలు
దరిలోనుంటే
పొలాల పంటలు
నిండుగ పండును
*

-బెలగాం భీమేశ్వరరావు