Others

ఈ నియమాలు పాటిద్దామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. మనం తీసుకునే ఆహారంలో హెచ్చ్భుగం పండ్లు తీసుకోవాలి.పచ్చి కాయగూరలు కూడా అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ వుంటాయి.
2. పంచదారకన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు. లేదా బెల్లం వాడకం కూడా మంచిదే.
3. తాజా ఆకుకూరలు ఆరోగ్యానికెంతో మంచిది. చుక్కకూర, తోటకూర, బచ్చలికూర, గోంగూర, పాలకూర మొదలైన వాటిలో హెచ్చు కాల్షియం వుంటుంది. ఐరన్, కెరోటిన్, రిబోప్లావిన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్‌లు వుంటాయి. కాబట్టి ఎక్కువగా ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిది.
4. ఇక తాజాపండ్లు ఆరంజి, యాపిల్, బొప్పాయి అరటిపండు తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యూస్ కూడా మంచిదే. అందులో విటమిన్ సి వుంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి.