Others

సాయం మాయం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయం అనే మాట
మాయమైపోయింది..

మనిషికి మనిషికి ‘సాయం’
ఈ మాట విని ఎన్నిరోజులవుతుందో..
కాకులలో, కోతులలో ఉన్న కలయిక
మనిషిలో మాయం
అయిపోయింది..

నేడు మానవునిలో మనకెందుకు
అనే స్వార్థం తప్ప.. అయ్యో
సాటి మనిషి అనే పదం
మాయమైంది..
ఎక్కడ కన్నా విన్నా స్వార్థం అనే
సముద్రంలో కొట్టుకుపోతున్నారు..
అందుకే సాయం మాయం
అయిపోయింది..

ఈ కలియుగంలో ఎవరికి ఎవరు
సాయం చేయాలన్నా మనస్సులేదు. కానీ..
సాటి మనిషికి
సాయం చేయాలన్న ఆలోచనను
మాయం కానివ్వద్దు...

-ఉషశ్రీ తాల్క