Others

నవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు కళ్లకింద
పూర్ణం బూరెలపై
చల్లని పిల్లవాయువులతో కలసి
మల్లెపూవు విచ్చుకున్నట్టు
సంపూర్ణమైన నవ్వు
కమ్మనైన నవ్వు
మంచి చెడ్డ మనుష్యుల సహజీవనంలో
వారిని దాటుకుంటూ పోవడానికీ నవ్వు
సాయంత్రం వచ్చి
విశ్రాంతి తీసుకొనే నేపధ్యంలో
ఏవో స్మరణల్లో దగ్గర లేని వారి గురించి
బాధదాచుకునే నవ్వు
అందరినీ వదిలించుకుని అమ్మ అండలో
నాకు నీవు, నీకు నేను అనడంలో
తాథ్యాత్మపు నవ్వు
దోచిన హృదయాలు దోబూచులాడే స్మృతులు
వెక్కిరిస్తున్న వేళలో
నిజమైన ఆత్మీయులతో
మనసు విప్పుకునే నవ్వు
అధైర్యం కొండలా మీద పడి
రాత్రిళ్లు మరీ బరువైనప్పుడు గుర్తుకు
తెచ్చుకునే చిలిపి చేష్టల గుర్తులైన నవ్వు

-ప్రసన్నాంజలి