AADIVAVRAM - Others

‘కళా’ కార్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు కారంటే ఓ దర్పం. కానీ నేడు కారంటే ఓ స్టైల్.. ఓ క్రేజ్.. ఓ కళాఖండం.. కారు కళాఖండమేంటి? అని అనుకుంటున్నారా.. అంతలా ఆశ్చర్యపోకండీ.. కుర్రకారు కార్లను కూడా కళాఖండాలుగా మార్చేస్తున్నారు ఇల్యూజనరీ ప్రింట్ల సహాయంతో.. ఇదేదో ఫ్యాషన్ తంత్రం అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే కార్లకు రకరకాల ప్రింట్లు వేయించుకోవడం హాలీవుడ్‌ను దాటి బాలీవుడ్.. మన దగ్గర కూడా విస్తరిస్తోన్న సరికొత్త ట్రెండ్. మొన్నటికి మొన్న పుణెకు చెందిన పరిధిభాటి, భావనాశర్మ, టోను అనే ముగ్గురు యువతులు తాము కొన్న హోండా కారుపై తమ అభిమాన నటి శ్రీదేవి వివిధ ఫొటోలను ముద్రించారు. వారి అభిమానాన్ని చూసిన భోనీకపూర్ వారిని ఇంటికి ఆహ్వానించారు. ఏది ఏమైనా అందరికన్నా భిన్నంగా ఉండాలనుకోవడమే ఈతరం స్టైల్. రోడ్లపై వెళ్ళే అందరి కార్లలో తమ కారూ కలిసిపోతే వారికి మనసు ఒప్పదు. అందుకే, తమదైన స్టైల్‌ను ప్రదర్శించడానికి కార్లకు రకరకాల ప్రింట్లూ, పెయింటింగ్‌లు వేయడం మొదలుపెట్టారు. మొదట్లో ప్రింట్లూ, పెయింటింగులపై అవగాహన ఉన్నవారు మాత్రం తమ కార్లను చూడచక్కని వినూత్నమైన డిజైన్లతో అందంగా తీర్చిదిద్దేవారు. కానీ ఇప్పుడు ఎవరి కారుకైనా వారికిష్టమొచ్చినట్లు పెయింటింగులు వేసే కంపెనీలు చాలా వస్తున్నాయి. కొన్ని కార్ల కంపెనీలు అయితే ముందు బుక్ చేసుకున్న వినియోగదారులకు పెయింటింగులూ, ర్యాప్‌లతో కారు మొత్తానికీ డిజైన్లు వేసిస్తున్నాయి. కొన్ని కార్లు నేరుగా రకరకాల డిజైన్లతో అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. కొంతమంది మాత్రం ఖరీదైన కార్లమీద బొమ్మలేంటి చీప్‌గా..? వాటి దర్పమంతా పోదూ.. అంటుంటే.. కుర్రకారు మాత్రం వారి మాటలను కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే వింతగా ఉండడం, విభిన్నంగా కనిపించడమే నేటితరం పఠించే మంత్రం. అందుకు ఏం చెయ్యడానికైనా సిద్ధపడతారు వారు. కాసేపు మన కారు నుంచి కళ్లు తిప్పుకోకుండా ఉండాలన్నా, మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాలన్నా ఇలాంటి అవాక్కయ్యే ఇల్యూజనరీ ప్రింట్లే ఉండాలి మరి. విలాసవంతమైన కార్లను తయారుచేసే సంస్థ అయిన బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ ఏకంగా కార్లను కాన్వాస్‌లుగా మార్చి ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులతో వాటిపై పెయింటింగ్‌లు వేయిస్తోంది. ఈ చిత్రకారులు మామూలు కాన్వాస్ మీద వేసిన పెయింటింగులే వందల కోట్లకు అమ్ముడుపోయినవి ఉన్నాయి. అలాంటిది కారుపై వేస్తే ఆ ఆర్ట్‌కార్‌కి ఎంత విలువో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇలా ముస్తాబైన కళాఖండాల కార్లను ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో ప్రదర్శన కూడా పెడుతోంది ఈ సంస్థ. కారుపై కార్టూన్ల చిత్రాలు, నచ్చిన తార ఫొటోలు, అచ్చం బంగారంతో తయారుచేసినట్లు బంగరురంగు పూత పూసినవీ, కారు ముందుభాగం పులినోరు తెరిచినట్లుగా.. ఇలా.. వినూత్నమైన ఇల్యూజనరీ పెయింటింగులతో కార్లకు కొత్త సొబగులు అద్దుతున్నారు నేటి కొత్తతరం. మరి ఇలాంటి కార్లు ట్రాఫిక్ జామ్‌లను ఎంజాయ్ చేసేలా చేస్తాయేమో.. చూడాలి మరి!