AADIVAVRAM - Others

వాహనాలకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధిస్తున్న వివిధ రకాల పన్నుల పుణ్యమాని, రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతూ పోతున్నాయి. ప్రజలు పడ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వాహనాల వల్ల బయటకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ప్రజలకు వారు వాడుతున్న వాహనాల మైలేజీ పెంచేందుకు ప్రత్యామ్నయ మార్గాన్ని అనే్వషించారు మెకానికల్ ఇంజనీర్ ఆదిత్యకిషోర్.
వాహనాల మైలేజీ పెంచడంతో పాటు కాలుష్య నివారణ కోసం ఆదిత్యకిషోర్ తయారు చేసిన ‘నియోప్లాట్రాన్’ కిట్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఈ కిట్ ద్వారా కార్లు, జీపులు, టూ వీలర్ నుండి ట్రక్స్, బస్సులు, డిసిఎంలు, లారీలు తదితర వాహనాలకు ఈ కిట్‌ను బిగిస్తే 10 కిలోమీటర్లు వచ్చే వాహనం, 18 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని మెకానికల్ ఇంజనీర్ ఆదిత్య కిషోర్ అంటున్నారు. దీంట్లో పెట్రోల్, డీజిల్‌లకు కొద్దిగా వ్యత్యాసం ఉంటుందని, ఈ కిట్‌ను వాహనాలకు బిగించడం ద్వారా కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చని ‘నియోప్లాట్రాన్’ కిట్ సృష్టికర్త వి. ఆధిత్యాకిషోర్‌కుమార్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ఈకిట్ ఉపయోగం గురించి వివరించారు. ఈ కిట్‌ను 2014లోనే తయారు చేయడం జరిగిందని, ఈ కిట్‌కు ఎలాంటి అనుమతి అక్కర్లేదని అన్నారు. ఈకిట్‌ను ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి 3వేల కిట్‌లను వాహనాలకు అమర్చడం జరిగిందని, అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేల కిట్‌లను అమర్చడం జరిగిందన్నారు. 2017 ఆగస్టున ఈ కిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించనుందని అన్నారు. ఇప్పటికే ఈ ‘నియోప్లాట్రాన్’ కిట్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కిట్ వినియోగంపై విజయవాడలో 600మంది మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కిట్ వాహనాల మైలేజీతో పాటు కాలుష్యనివారణ, ఇంతేకాకుండా వాహనాల ఇంజన్ సామర్థ్యం 20శాతం పెరుగుతోందని అన్నారు. ఇంజన్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతోందని వెల్లడించారు. ఎంతటి కొత్త వాహనం అయిన ఎలాంటి ఆల్ట్రేషన్ లేకుండా కేవలం 35నిముషాల్లోనే ఈ కిట్‌ను వాహనానికి అమర్చడం జరుగుతోందని వివరించారు. ఈ కిట్ తయారీకి ఇప్పటి వరకు తనకు ఎలాంటి పోటీదారులు రాలేదని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమొడి గ్రామంలో జన్మించిన ఆదిత్యకిషోర్ కుమార్, టెన్త్‌క్లాస్ వరకు గుంటూరులో విద్యను అభ్యసించారు. టెన్త్ వరకు చదివినా ఆయన ఐటిఐ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్‌ను గుంటూరులో పూర్తి చేశారు. తరువాత రామంతపూర్‌లోని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్‌లో ప్రాసెస్ ఇనిస్ట్ట్రుమెంటేషన్ అండ్ లాజిక్ కంట్రోల్స్ కోర్సును పూర్తి చేశారు. మెకానికల్ అండ్ ఎల్‌పిజీ సిఎన్‌జీ డిస్ట్రిబ్యూటర్‌గా నాచారంలో పనిచేశారు. ఎల్‌పిజీ మరియు సిఎన్‌జీలో ఇటాలియన్ కంపెనీ తరపున 22సంవత్సరాలు పనిచేయడం జరిగిందని, ఆ సమయంలోనే నీటితో నడిచే కారు గురించిన వార్తలు వచ్చాయని, అప్పుడే తనకు కొత్త ఆలోచన వచ్చిందని, అప్పటి నుండి తాను వాహనాల మైలేజ్ పెంపు, కాలుష్యం నియంత్రించాలన్న పట్టుదలతో కృషి చేసి, రెండేళ్లపాటు కృషితో నియోప్లాట్రాన్ కిట్‌ను ఎట్టకేలకు తయారు చేసినట్లు వెల్లడించారు. మొట్టమొదటి కిట్‌ను ఓ ప్రముఖ కంపెనీలో పైప్‌లైన్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న జివి.రాజేశ్వర్‌రావుకు చెందిన నిస్సాన్ ఎక్స్‌ట్రైల్ కారుకు అమర్చడం జరిగిందన్నారు. ఈ కారు మైలేజీ లీటర్ డిజీల్‌కు 8కిలోమీటర్లు వచ్చేదని, తాను తయారు చేసిన కిట్‌ను బిగించడం వల్ల 14కిలోమీటర్ల మైలేజీ వచ్చిందని, ఇంతేకాకుండా పెద్దగా శబ్ధం వచ్చే ఇంజన్ శబ్ధం చాలా వరకు తగ్గిపోయిందని, కారు నుండి వచ్చే పొగకాలుష్యం కూడా తగ్గిపోయిందన్నారు. ఇప్పటికీ ఆయన ఇదే కారును ఇంకా వాడుతున్నారని స్పష్టం చేశారు. కిట్‌లో ఎలక్ట్రానిక్ మైక్రో కంట్రోలర్, ప్యూయల్‌సెల్ ఉంటుందన్నారు. కిట్ వాహనం డిక్కిలో బిగించి, పైప్‌ద్వారా ఇంజన్ ఎయిర్‌ఫిల్టర్‌కు కనెక్ట్ చేయడం జరుగుతోందని అన్నారు. ఎలక్ట్రానిక్ మైక్రో కంట్రోలర్ నుండి ఫ్యూయల్ ఇంజన్‌లోకి వెళ్తుందన్నారు. దీని ఖరీదు వాహన సామర్ధ్యం బట్టి ఉంటుందని, ఉదాహరణకు 600నుండి 1800సీసీ ఇంజన్ ఉన్న వాహనానికి జిఎస్టీతో కలిపి 23వేల రూపాయలు అవుతోందని, ద్విచక్ర వాహనాలకు కిట్ ఖరీదు 3,400రూపాయలు జిఎస్టీని కలుపుకోని అవుతోందని అన్నారు. బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకు దాదాపుగా 80వేల రూపాయల వరకు ఖర్చు అవుతోందని అన్నారు. ఈ కిట్‌కు ఒక ఫైనాన్స్ సంస్థ ద్వారా ఇఎంఐ సౌకర్యం కల్పించనుందన్నారు. ఒక తెలుగువాడై ఉండి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్యంతో పాటు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ప్రజల ఇబ్బందిని గమనించి, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో వాహనాల మైలేజీ పెంపు కోసం తన స్వంత కృషితో ఈ కిట్‌ను తయారు చేశారు ఆదిత్య కిషోర్. ఇప్పటికే మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే దీనికి డిమాండ్ పెరుగుతూ పోతోంది. ఇతనికి ప్రభుత్వ సహకారం అందిస్తే, దేశ వ్యాప్తంగా కాలుష్య రహిత వాహనాలు నడిచేలా చేస్తానంటున్నారు ఆదిత్యకిషోర్. మరి ప్రభుత్వం నుండి ఇతని పరిజ్ఞానానికి ఏ మాత్రం సహకారం అందుతుందో వేచి చూడాలి. ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెల్సుకోవాలంటే తీతీతీ.శళ్యఔ్ఘఆ్యశ.ష్యౄ లో పరిశీలిస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెల్సుకోవచ్చు.

--వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్ 94402 87170