Others

డేటింగ్‌లో నిధి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా స్టార్స్‌కు క్రికెటర్స్‌కు మధ్య ప్రేమ వ్యవహారాలు ఈరోజు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ క్రికెటర్స్‌తో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు.. మరికొందరు ప్రేమాయణాలు మాత్రమే నడిపిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా నాగచైతన్య హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఓ క్రికెటర్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందన్న న్యూస్ ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిధి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డ క్రికెటర్ ఎవరో తెలుసా...? టీమిండియా స్టార్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్. ఐపీఎల్ 2018లో కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఆ జట్టులో బాగానే మెరిశాడు. ప్రస్తుతం ఐపీఎల్ ముగియడంతో నిధి, రాహుల్ కలిసి ముంబై వీధుల్లో చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరిగేస్తున్నారట. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. నిధి బాయ్‌ఫ్రెండ్ రాహుల్... ఫిట్నెస్ ఛాలెంజ్‌ని చైతూకు విసిరాడు... ఆ ఛాలెంజ్ స్వీకరించిన చైతు జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు.