Others

మీకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన చిత్రాలలో ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు ప్రేక్షకులు చూసారు. అన్ని చిత్రాల్లో కొన్ని చిత్రాలు మనసును ఆకట్టుకుంటాయి. హృదయాన్ని ఏ పిల్ల సమీర తీరాలకో తీసుకెళతాయి. కొన్ని చిత్రాలు సందేశాత్మకంగా ఉంటే, మరికొన్ని నిత్య నూతనంగా భావించే ప్రేమలాలిత్యంతో అద్భుతంగా ప్రేక్షకుల మనసులలో తొణికిసలాడుతాయి. ఏ సినిమా ఏ ప్రేక్షకుడికి ఎలా నచ్చుతుందో తెలియదు. ఒక్కసారి సినిమా చూశాక ఆ చిత్రం నిరంతరం ప్రేక్షకుణ్ణి వెంటాడింది అంటే అది ఉత్తమ చిత్రమే. అదేవిధంగా ఒక్కసారి మన అద్భుతమైన సంగీత దర్శకులు బాణీలు కట్టిన పాటలు వింటే, మళ్లీమళ్లీ అదే పాట చెవులలో మారుమ్రోగుతుంటే, అది ఉత్తమమైన బాణి. సాహిత్యపరంగా అద్భుతంగా తీర్చిదిద్దిన మాటలు. తమ గానంతో గాయనీ గాయకులు ఆ పాటకు అమరత్వాన్ని చేకూరుస్తారు. అటువంటి గొప్ప పాటలు సినిమాలు మనకు కొదవలేదు. అటువంటి పాటలకు లేక చిత్రాలకు వేదికే ఈ శీర్షిక. మీకు నచ్చిన పాట కానీ, చిత్రం కానీ ఈ శీర్షికలో మీరు పాఠకులతో మీ భావాలు పంచుకోవచ్చు. అయితే, మీకు ఆ పాట కాని, ఆ చిత్రం కాని ఎందుకు నచ్చింది అనే విషయాన్ని సవివరంగా రాయాల్సి వుంటుంది. మీకు నచ్చిన ఆ పాటను కానీ, చిత్రాన్ని కానీ తోటి పాఠకులతో పంచుకోవడానికి ఇది ఉత్తమమైన వేదిక. ఇక ఆలస్యమెందుకు మీకు నచ్చిన పాట లేక సినిమా గూర్చి సవివరంగా వ్రాసి మీ ఫొటోతో సహా పంపమని ఆహ్వానిస్తున్నాం.
*
మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 03