Others

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు..’(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు నలభై వసంతాల కావల జీవం పోసుకున్న ఈ దేవులపల్లివారి గీతం- ఈనాటికీ ఇంకా సజీవమే! కుసుమ కోమలమైన సున్నిత సాహిత్య పరిమళానికి ప్రాణంపోసి- పద లాలిత్యంతో పదుగురి ప్రశంసలు గుబాళించిన దేవులపల్లి గీతాలు దేనికవే గొప్పవి అని చెప్పుకున్నా- ప్రకృతిని ప్రశ్నిస్తూ ఆ పరమాత్ముని సన్నిధికి చేరాలని తహతహలాడే పువ్వుల గొప్పదనాన్ని, చెప్పకనే చెపుతున్న ఈ పాట- ‘ఈనాటి ఈ బంధం ఏనాటిదో’ అనే చిత్రంలోనిది. స్వరకర్త కీ.శే.సాలూరు రాజేశ్వరరావుగారు. స్వర మధురిమనందించినవారు గాన కోకిలమ్మ- మన సుశీలమ్మ! సన్నివేశానుగుణ అభినయని శ్రీమతి జయప్రదగారు. పువ్వులను పూజకు సంసిద్ధంచేసే ప్రయత్నంగా భక్తిపారవశ్యంతో ఆలపించిన ఈ మధురగీతం- అమరం, అజరామరం! సాక్షాత్ సృష్టికర్తే తన ఘనతను చాటుకున్నాడా? అనేట్టుగా ఈ పాట పల్లవీ- చరణాలకు శ్రీకారం చుట్టాడా అనిపించేటట్లున్న ఈ గీతం ఆరంభంలోనే ఆత్మానందానుభూతిని కల్గిస్తుంది! నిజమే- కొమ్మలకు ఎవరు నేర్పారు పూలిమ్మని? ‘‘అదీ ఎంత తొందరే హరి పూజకు పొద్దుపొడవకు ముందే’’ అనే సందేహాస్పద భావన- మనసును ప్రకృతి ద్వారా పవిత్రం చేసినట్లుంది. పాట చరణాలు కూడా రాగయుక్తమై పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనతో లీనమై- ‘‘మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి- మొల్లలివి ననే్నలు నా స్వామికి’’ అంతరాత్మలో పరమాత్ముణ్ణి ఐక్యం చేస్తున్నట్లు స్ఫురిస్తుంది! బాపూ బొమ్మ, దేవులపల్లి కవిత-ఇలా కొన్ని ప్రామాణికంగా నిలిచిపోయాయంటే ఇలాంటి మధుర గీతాలే తార్కాణం! ఈ పాట ద్వారా దేవులపల్లివారి ‘కీర్తి’ మరో మెట్టు చేరిందంటే అతిశయోక్తికాదు.

-మరువాడ భానుమూర్తి, వనస్థలిపురం