Others

సుశీల పాత్ర నచ్చిందట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి షాలిని పాండే. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత షాలిని మహానటి సినిమాలో సుశీల పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని సుశీల పాత్ర గురించి షాలిని మాట్లాడుతూ- మహానటిలోని సుశీల పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. సావిత్రి చిన్నపాటి స్నేహితురాలిగా అమాయకంగా కనిపిస్తూ స్నేహితురాలిపట్ల కుమిలిపోయే పాత్రలో నటించాను. ఇప్పుడు ఈ పాత్రకి వస్తున్న రెస్పాన్స్‌కి చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు. మనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశామా లేదా అనేదే ముఖ్యం అని వివరించింది.