Others

మరో ఐటెం సాంగ్‌లో కాజల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కోసం గ్లామర్ భామ.. అదికూడా పక్కా లోకల్ భామను దింపుతున్నారు. పక్కా లోకల్ భామ ఎవరనే షాక్ అవుతున్నారా.. ఆమధ్య ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్.. నేను పక్కా లోకలు.. అంటూ చిందేసిన హాట్ భామ కాజల్? ఆ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆమెతోనే ఐటం సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం కాజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఈ పాటను ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరిస్తారట. సో... మొత్తానికి ఎన్టీఆర్ కోసం కాజల్ మరోసారి ఐటెమ్ గర్ల్‌గా మారుతుందన్నమాట!