Others

పవన్ కోబలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో 2019 తరువాత కోబలి సినిమా తెరకెక్కించే అవకాశం ఉండొచ్చని అటున్నాడు క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్? పవన్-త్రివిక్రమ్‌లమధ్య మంచి స్నేహం నెలకొన్న విషయం తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది వంటి సంచలన చిత్రాలను అందించిన త్రివిక్రమ్, మరోవైపు అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ చిత్రాన్ని తీశాడు. అయితే వీరిద్దరి కలయికలో కోబలి తెరకెక్కించే ప్రయత్నాలు ఆమధ్య జరిగాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అసలు ఫ్యాక్షన్ ఎలా పుట్టి, పురులు విప్పుకుంది అన్న కథాంశంతో తీయాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత ఈ సినిమాకు ప్రయత్నాలు ఆగిపోయిన నేపథ్యంలో తాజాగా త్రివిక్రమ్ పవన్‌తో కోబలి సినిమా తీస్తానని అంటున్నాడు. అంటే ఇన్‌డైరెక్టుగా పవన్‌కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పకనే చెప్పాడు. చూద్దాం.. మరి త్రివిక్రమ్ చెప్పిన కోబలి పట్టాలు ఎక్కుతుందో లేదో?!

- శ్రీనివాస్ ఆర్.రావ్