AADIVAVRAM - Others

మహానటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలారోజులకి సినిమా చూశాను. అది మహానటి. సావిత్రి జీవితం గురించి తీసిన సినిమా. విరామం వరకు సినిమా బాగనిపించింది. ఆ తరువాత మనస్సంతా బరువెక్కిపోతుంది. అయితే రెండు భాగాల నుంచి మనం నేర్చుకోవలసినవి ఎన్నో వున్నాయి.
మొదటి సినిమా షూటింగ్‌లో సావిత్రి సరిగ్గా డైలాగులు చెప్పలేకపోతుంది. దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ ఆమెను తొలగిస్తాడు. సినిమాకు నువ్వు పనికిరావు అని చెబుతాడు. దాన్ని సవాలుగా సావిత్రి స్వీకరిస్తుంది. రెండవ సినిమాకి చక్రపాణిగారు హీరోయిన్‌గా సావిత్రిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత దర్శకుడు ఎల్. వి.ప్రసాద్‌కు పరిచయం చేస్తారు. సావిత్రి సినిమాకు పనికిరాదని ప్రసాద్ అం టారు. చక్రపాణిగారు ఒత్తిడి చేస్తారు. సావిత్రి డైలాగ్ బ్రహ్మాండంగా చెబుతుంది. ప్రసాద్‌గారు ఆశ్చర్యపోతారు. మొదటి సినిమాలో కూడా ఇలా చెబితే నిన్ను తీసేసేవాడిని కాదు కదా అంటాడు. ఏమైనా నిన్ను చిత్రరంగానికి పరిచయం చేసే అవకాశం నాకే వచ్చింది అని అంటాడు. ఆ తరువాత సావిత్రి నటిగా మహానటిగా ఎలా మారిందో మనకు తెలిసిందే. సినిమాకు పనికిరాదన్న విషయాన్ని సవాలుగా తీసుకుంది సావిత్రి. తాను గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు తెప్పించగలనని, అది రెండంటే రెండు అని నిరూపించింది. ఎవరైనా మొదటిసారి విఫలం అయినా తరువాత విజయం వైపు ప్రయాణం చేయవచ్చని సావిత్రి నిరూపించింది.
జీవితంలో క్రమశిక్షణ ఎంతో అవసరమన్న విషయాన్ని విరామం తరువాతి సినిమా చూపిస్తుంది. అలవాట్లలో క్రమశిక్షణ వుండాలి. ఆర్థికపరమైన విషయాల్లో క్రమశిక్షణ మరీ ఎక్కువగా వుండాలి. ఇవి రెండూ లేక మహానటి జీవితం విషాదాంతమైంది. ఆమె అభిమానులకి విషాదాన్ని ఇచ్చింది.
మనం దేన్నైనా సాధించగలం. అందుకు కావల్సింది క్రమశిక్షణ. ఓటమిని ఆశావహ దృక్పథంతో సవాలుగా స్వీకరించడం.
ఈ రెండూ మహానటి నుంచి మనం నేర్చుకోవచ్చు. సాహిత్యంతోబాటూ జీవిత చరిత్రలు చదవాల్సిన అవసరం చాలా వుంది. అది విజేతలవే కావాల్సిన పనిలేదు. సామాన్యులవైనా పర్వాలేదు. మనం ఎంతో నేర్చుకోవచ్చు. మంచిని స్వీకరించవచ్చు.
మన ఊర్లో కూడా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తులు ఎందరో వుంటారు. చూసే నేర్పు మనలో వుండాలి.
మహానటి నుంచి ఇంకా ఎన్నైనా స్వీకరించవచ్చు. ఎన్నైనా కన్పించవచ్చు. నాకు కన్పించినవి ఆ రెండూ.