Others

కన్నతల్లీ.. నీకు వందనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను కన్నతల్లీ.. నీకు వందనం
కడుపులో ముద్దగా ఉన్న నన్ను
పెద్దగా చేసి..
నాకు జీవితాన్నివ్వాలని
ప్రాణం పోసి..
కడుపులో కదులుతున్న
ప్రతిసారి నీ కళ్ళలో కలిగే ఆనందం
నన్ను చూడాలని మురిపిస్తూ ఉండే నువ్వు..
ఆడపిల్లనని తెలియగానే ఒక్క
క్షణం కూడా ఆలోచించకుండ..
నా ప్రాణం తీస్తున్నావు..
అమ్మ నీవు కూడా ఒక ఆడతల్లికే పుట్టావు కదా..
మరి నీతల్లి నినే్నలా పెంచిందే..
నీవు కూడా నన్ను
అలా పెంచలేవా అమ్మ...

-కసిరెడ్డి హారిక