Others

‘‘కృష్ణం వందే జగద్గురుం’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన ఒక్కడే. ఆయన అనంతుడు, అసమానుడు. కాని ఎవరికి యిష్టమైన రూపాన్ని, అవతారాన్ని వారు ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు, ఆనందం అనుభవిస్తున్నారు.
నా యిష్టదైవం గోపాలకృష్ణుడు. చిన్నతనం నుండి నాకు కృష్ణుడంటే అమితమైన యిష్టం. ఎక్కడ తిరునాళ్లు జరిగి, ‘పరస’ జరిగినా చిన్నతనంలో అక్కడికి వెళ్లి కృష్ణుని ప్రతిమలు కొనుక్కునేదాన్ని. ఆ కృష్ణ భక్తి నాలో అలా పెరుగుతూ వచ్చింది. నా గదిలో, పూజామందిరంలో ఎటు చూసినా కృష్ణుని విగ్రహాలు, చిత్రపటాలు దర్శనం ఇస్తాయి.
ప్రతి సంవత్సరం శ్రీకృష్ణజన్మాష్టమిని వేడుకగా జరుపుకుంటాం. ఆ దినం ఉపవాసం వుండి ఎనిమిది రకాలపళ్లు, ఎనిమిది రకాల పిండివంటలు, ఎనిమిది రకాల పువ్వులు సమకూర్చి, అమితోత్సాహంతో శ్రీకృష్ణ భగవానుని జన్మదినం జరుపుతాము. ఆ రోజున శ్రీకృష్ణుడు బోధించిన గీత 18 అధ్యాయాలు చదివి ఆయన్ని కొలుస్తాము. రాత్రి ఊయల ఊపి భజన చేసి వేడుక చేసుకుంటాము. చిన్నతనం నుండి అలా శ్రీకృష్ణుని సేవించడం అలవాటు.
ఋషీకేశ్ (హిమాచల్‌ప్రదేశ్)లో వున్న శ్రీ శివానంద ఆశ్రమంలో స్వామి శివానంద మహరాజ్ శ్రీకృష్ణ భగవానుని సాక్షాత్కారం పొందిన ప్రదేశం చూడడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణ భగవానుని విగ్రహం చూచి తన్మయత్వం పొందని వారుండరు. అక్కడకు నేను వెళ్లినప్పుడు శ్రీ స్వామి శివానంద మహరాజావారి శిష్యులు శ్రీ దేవానంద స్వామివారి దర్శనం చేసుకున్నాను. స్వామి శివానంద ఆశ్రమం దర్శించడం జరిగింది. శ్రీ దేవానందస్వామి నన్ను ప్రశ్నించేరు- ‘‘మీరు ఏ దైవాన్ని కొలుస్తారు?’’ అని. శ్రీకృష్ణ భగవానుడు నా యిష్టదైవం అని చెప్పినపుడు ఆయన నాకు శ్రీకృష్ణ భగవానుని స్మరించే మంత్రం నాకు ఉపదేశించారు. ఆ మంత్రాన్ని నిత్యం జపిస్తాను.
ఉదయం నిద్ర లేవగానే శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుని, ఆ దివ్యమంగళ స్వరూపుని ఆశీసులు తీసుకున్నాకే నా దినచర్య.
ఆ మనోహరమూర్తి, ఆ దివ్య మంగళ స్వరూపుని ఆశీస్సులు నాకే కాదు అందరికీ అందించాలని ఆశిస్తున్నాను.
‘‘ఓం! కృష్ణం వందే జగద్గురుం’’

- శివాని