Others
తీరని దాహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 3 June 2018
- మహమ్మద్ నసీరుద్దీన్ 9440237804

జీవితం అనుక్షణం చెలరేగే భావాలతో
సముద్రపు ఓడలా ప్రయాణిస్తుంది
దారి నిండా అలుపెరుగని పోరాటాలతో
ఆత్మ సిద్ధాంతాలపై సవారి చేస్తుంది
ప్రతిసారీ కోల్పోతున్న స్వప్నాల్ని
మళ్ళీ మళ్లీ పునరుజ్జీవింపచేయడానికి
ఉఛ్వాస నిశ్వాసాల మధ్య హృదయ
రేఖలపై జ్ఞాపకాల పొరలను
ఏర్పాటు చేసుకుంటుంది
రెక్కలు తొడిగిన ఆలోచనలతో
భవిష్యత్ ఆకాశం ఆశాజనకమైనప్పుడు
ఆనందం ఊపిరి సంతకమై
కన్నీటి కావ్యానికి భాష్యం చెబుతుంది
ఎప్పుడైతే ఆనందపు జీవితంలో
విషాదపు ఛాయలు చుట్టు ముడుతాయో
అప్పుడు అసంతృప్తి జ్వాలలు లేచి
ఆశల సామ్రాజ్యాన్ని భస్మీపటలం చేస్తాయి
జీవితం మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నంలో
అగ్ని రేఖలపై నుండి ప్రయాణిస్తుంది
‘తీరని దాహం’లా
ఆ జీవితం వెంటే లేస్తాయి...