Others

సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ దరినీ..
ఈ దరినీ..
కలుపుతూ
ఓ అందమైన బంధానికి
బాటలు వేసింది
అరచేతిలో అద్భుతం..!!

ఎన్నో
గడియలు..
విఘడియలు..
రోజులూ..
మాసాలు..
కాలం కుంపటిలో
కాలి బూడిదై
పెదవి
చిట్లించబోతున్న తరుణంలో
హఠాత్తుగా ఓ రోజున
గుమ్మం ముందు గువ్వలా..
అనుకోని అతిథిలా..
నా అరచేతిలోకి
వచ్చి వాలింది
ఆమె గుండె గూటి నుండి
యెగిరి వచ్చిన ఓ
చిరు సందేశం!!

అప్పటివరకూ
అంతరంగంతరాలలో
వేళ్లూనుకుపోయిన
నైరాశ్యపు వృక్షాన్ని
కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసింది
ఆమె సందేశం..
కంటికి కనిపించని
వౌనాల మంచుతెరలను...
నిశ్శబ్దాల అడ్డుగోడలనూ..
కూల్చివేసిన
ఆమె పలకరింత
ప్రభాత కాల ఉషస్సులతో
నా మనో మహల్‌ను నింపింది..
‘సంధ్యా’సమయ అరుణిమలను
నా గుండె గోడలపై అద్దింది..!!
*

-సయ్యద్ రసూల్ 9948258037