Others

మనీషాకు మరొకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీషా కోయిరాలా సెకెండ్ ఇన్నింగ్స్ వేగం పెంచుతోంది. ఆరోగ్యం కుదుటపడిన తరువాత తీరిగ్గా తెరమీదకు అడుగుపెట్టినా -ప్రాజెక్టుల వేగం పెంచే ఆలోచనలో ఉందట. ఇప్పటికే తమిళ చిత్రంతో బిజీగావున్న మనీషా -తాజాగా దర్శకుడు బాల చిత్రానికి సంతకం చేసినట్టు చెబుతున్నారు. కానె్సప్ట్, కంటెంట్ విషయంలో దర్శకుడు బాల ఏమాత్రం రాజీపడడని చెప్పడానికి అతను చేసిన సేతు ఒక్కటి చాలు. అలాంటి బాల ప్రాజెక్టుకు మనీషా సంతకం పెట్టడం -చిత్రాల ఎంపికలో ఆమె ఆలోచన స్పష్టమవుతుంది. ‘కుట్ర పరంబరై’ పేరిట తెరకెక్కుతున్న చిత్రమైన కథాంశంలో మనీషా ముఖ్యపాత్ర చేయబోతోందట. ఇప్పటికే విశాల్, అధర్వ, ఆర్య, అరవింద్‌స్వామిని ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్న బాల, తాజాగా మనీషాను ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. సొంత బ్యానర్‌పై బాల తెరకెక్కిస్తున్న చిత్రం -సెకెండ్ ఇన్నింగ్స్‌లో మనీషాకు బలమైన ట్రాక్ వేస్తుందనుకోవాలి.