Others

ఊబకాయం ....సమస్యలెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు చిన్న పెద్ద తేడాల్లేకుండా అందరినీ ఊబకాయం బాధిస్తోంది. నిజానికి వూబకాయం అనేది ఓ వైద్య స్థితి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు వలన ఇది ఏర్పడుతుంది. కాని, ఇది ఆరోగ్యంపై దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయంతో పలు రకాల వ్యాధులు, మరీ ముఖ్యంగా కార్డియోవాస్క్యులర్ రోగాలు, టైప్ 2 మధుమేహం, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్‌ఆప్నియా, కొన్ని రకాల క్యాన్సర్‌లు, ఆస్టియో ఆర్థ్రరైటిస్, డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు అంటారు.
చిన్నారులలో ఊబకాయం దగ్గరకు వస్తే, ఆరోగ్యోకరమైన బిఎంఐ పరిధి వయసు, చిన్నారి లింగభేదాన్ని అనుసరించి మారుతుంటుంది.
అసలు ఊబకాయం ఎందుకు వస్తుందంటే
చిన్నారులలో ఊబకాయం పెరగడానికి మారుతున్న ఆహార శైలి, శారరీక శ్రమ తగ్గడం, స్కూలకు నడచుకొని వెళ్ళే పరిస్థితులు లేకపోవడం, పాఠశాలలో ఫిజికల్ విద్య లేకపోతుండడం, స్పోర్ట్స్ కార్యక్రమాలు తగ్గడం లాంటివి కారణాలు. దీనివల్ల చిన్నారుల్లో హైపర్‌టెన్షన్, మధుమేహం, హైపర్ లిపిడెమియా, ఫ్యాట్ లివర్ సంబంధిత పరీక్షలు చేయాల్సి వుంటుంది. చిన్నారులకు ఉపయోగించే చికిత్సలు ప్రధానంగా జీవనశైలి, ప్రవర్తన మార్పు సంబంధిత అంశాలకు సంబంధించినవే ఉంటాయి. తరువాత దశలలో ఊబకాయం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వీటిలో గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు కలుగుతుంది.
ఊబకాయం నుంచి తప్పుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ... రోజువారీ ఫుడ్ డైరీ ఉంచుకోవాలి. దీనివల్ల తాము తినే పదార్థాలమీద అదుపు ఏర్పడుతుంది. ఆహారాన్ని తీసుకోవడంలో కూడా మార్పులు అవసరమే. అంటే నెమ్మదిగా తినడం, భోజనం చేసేటప్పుడే బాగా నమలి తినాలి. క్యాలరీస్ తక్కువగా ఉంటే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పచ్చికూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. టైమ్ ప్రకారం భోజనం చేయాలి. ఎంత ఇష్టమైన ఆహారమైనా క్రమం శ్రుతి మించకుండా తీసుకోవాలి.
నడక అలవాటు చేసుకోవాలి. రోజు పొద్దున, సాయంత్రం 15 నిమిషాలు నడవడం మంచివి. స్థూలకాయానికి సంబంధించి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు గ్యాస్టిక్ బ్యాండ్ (ది ఓ రకమైన బేరియాట్రిక్ సర్జరీ) చేస్తారు.ఊబకాయానికి సంబంధించి ఇతర చికిత్సావకాశాలలో నిర్దుష్టమైన ప్రిస్క్రిప్షన్ మరియు ఆకలిని తగ్గించే ఓవర్ ద కౌంటర్ మందులైన ఓరిసాట్ మరియు లోకాసెరిన్ వంటివి అందిస్తారు. కానీ ఈ డ్రగ్స్‌వల్ల డయేరియా, తలనొప్పి, తిమ్మిరి, మైకం, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలుగవచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజరు వాటి వైవిధ్యమైన పనితీరు ద్వారా అందుబాటులో ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీవల్ల కలిగే లాభష్టాలను గురించి మరియు అందుబాటులోని బేరియాట్రిక్ శస్త్ర చికిత్సా విధానాలను గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరలోని బేరియాట్రిక్ సర్జన్‌ను కలసి నిర్ణయం తీసుకొంటేనే మంచిది.
ఇవన్నీ కాకుండా వెయట్ తగ్గాలంటే ముందుగా రోజు క్యారెట్, బీట్‌రూట్ ల్లాంటివి పచ్చికూరగాయలు తీసుకొంటూ చిన్నపాటి వ్యాయామాలు, నడక చాలామంచివి. వీటివల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. దేన్నీ అతిగా చేయకుండా ఉండాలి. లేకపోతే వ్యాయామాలు కూడా ఒక్కోసారి ఆరోగ్యానికి ముప్పు తెస్తాయ.
*