Others

నవ్వే ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్పవరం నవ్వు. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడంవల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వితే ఆయువు పెరిగి శారీరక ఆరోగ్యం చేకూరి, చలాకీగా ఉండటంతో వత్తిళ్ళు దరిచేరవు. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు నవ్వగలిగితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వు వల్ల శత్రువులను కూడా మిత్రులుగా మారుతారు. అవకాశం వచ్చినపుడల్లా హాయిగా నవ్వి చూడండి. అపుడే మీకు నవ్వు విలువ తెలుస్తుంది. మీకు తెలియకుండానే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చి ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. దాంతో గుండె జబ్బులు దూరం అవుతాయి. మనిషికి నవ్వు అద్భుతమైన టానిక్. నవ్వడంవల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ తొలగించబడుతుంది. హాయిగా నవ్వగలిగేవారి ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు నవ్వుకు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచే గుణం ఉంది. నవ్వుకు దూరం అవ్వడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. మనుషుల మధ్య నవ్వుతూ విరబూసి ఆనందాన్ని పంచుకుంటే బంధాలు బలపడతాయి.