Others

మేము సైతం..శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకులు ఆదరించిన నాడే కళాకారులు, కళారంగం అభివృద్ధి సాధ్యం. అందుకే ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా ప్రేక్షకుల ఆదరణతోనే ఇంతవాళ్ళమయ్యాం అని కళాకారులు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతూ వుంటారు. కృతజ్ఞతలు కేవలం మాటలవరకే పరిమితం కాకుండా ప్రకృతి విలయతాండవం సంభవించిన సందర్భాలలో, అలాగే కరువుకాటకాలు సంభవించిన సందర్భాలలో కళాకారులు రాష్టమ్రంతా పర్యటించి ప్రదర్శనల ద్వారా నిధి సేకరణ జరిపి ఆదుకున్న సందర్భాలు కూడా అనేకం. ఈ కార్యక్రమాలు రాయలసీమలో కరువు సంభవించినప్పుడు మహానటుడు ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రారంభమై ఇతర సందర్భాలలోనూ కొనసాగాయ. కాలంలో వచ్చిన స్పీడ్‌నుబట్టి కళాకారుల స్టేజి ప్రదర్శనలు వెనకబడి, కళాకారులే క్రీడాకారులైపోయ రెండు టీంలుగా ఏర్పడి క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించటం మొదలైంది. ఈ కళాకారుల క్రీడాకారుల అవతారాన్ని కూడా యువతరాన్ని బాగానే ఆకర్షించింది. అలా హైదరాబాద్‌లో నిధి సేకరణకు ఏర్పాటుచేసిన క్రికెట్ మ్యాచ్‌లో టీం అధినేతలు అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్ ఒకరినొకరు అభినందించుకొంటున్న ఫొటో పై చిత్రంలో చూడవచ్చు.
ఇలాంటి నిధి సేకరణ విషయంలో ప్రతి కళాకారుడు మనసావాచా పలికేది ఒక్కటే మాట. కళాకారులుగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు ప్రకృతి విలయతాండవంతో నష్టపోతే వారిని ఆదుకోవటం మావంతు బాధ్యత అని. ఆదరించిన ప్రజలను ఆదుకోవాలన్నదే వీళ్ల కానె్సప్ట్.
ఈ కానె్సప్ట్ ఒక కథగామారి శ్రీమంతుడు చిత్రమైందనుకోవచ్చు. ఆ చిత్రంతో కళాకారులే వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయటానికి ముందుకొస్తున్న దృశ్యాలూ చూస్తున్నాం. ఏదేమైనా కళ కాసు కోసమే కాదు, ప్రజాసేవకూ అని కళాకారులు అనుకున్నంతకాలం ఆ రంగం పరిఢవిల్లుతూనే ఉంటుంది. ఏమంటారు?

-పర్చా శరత్‌కుమార్ 9849601717