AADIVAVRAM - Others

పవిత్ర ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర ఫలంగా, సంప్రదాయ ఫలంగా నీరాజనాలు అందుకుంటున్న ఫలరాజం ఖర్జూరం. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిములు ఉపవాస దీక్ష విరమణ సమయంలో విధిగా ఖర్జూరాన్ని ఆరగిస్తారు. మహమ్మద్ ప్రవక్త వారికి ఇది ఇష్టమైన ఫలరాజమని దివ్య ఖురాన్ గ్రంథంలో పేర్కొనబడింది. ఖర్జూరం చెట్టు కలపను ఆయన ఇంటికి ఉపయోగించారు. పవిత్ర మదీనా క్షేత్రంలోని మస్జిద్ ఏ నబవీ నిర్మాణంలో కూడా ఖర్జూరం కలపను వాడినట్లు తెలుస్తుంది. ఇస్లామిక్ దేశాలలో ఖర్జూరం వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎడారి ప్రాంతంలో పెరిగే ఒక విధమైన వృక్షఫలం పామే కుటుంబానికి చెందిన ఖర్జూరం. దీని శాస్ర్తీయ నామం ఫినిక్స్ డాక్టిలిఫెరా. ఆరెకేల్స్ క్రమానికి, లిలియాప్సిడా తరగతికి, మాగ్నోలియోపైటా విభాగానికి చెందినది ఖర్జూరం. ఇది ఎప్పుడు, ఎలా పుట్టిందో ఖచ్చితంగా తెలియకపోయినా మానవజాతికి పరిచయమైన తొలి ఆహారపు వృక్షంగా దీన్ని గుర్తించారు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్ గల్ఫ్‌లో జన్మించిన ఈ వృక్షాన్ని క్రీ.పూ. సుమేరియన్లు పెంచిన తొలిచెట్టుగా చెబుతుంటారు. తరువత బాబిలోనియన్లు, ఆస్సిరియన్లూ, ఈజిప్టువాసులు ఖర్జూరపు చెట్లను పెంచి పోషించారు. అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుండి స్పెయిన్‌కు, అక్కడ నుండి కాలిఫోర్నియాకు దీని శాఖలు విస్తరించినట్లు తెలుస్తుంది. అందుకే ముస్లింలతో పాటు యూదులు, క్రైస్తవులు ఈ చెట్టును ముఖ్యమైనదిగా గౌరవిస్తారు. సుమేరియన్లు ఈ చెట్టును శాంతికి, న్యాయానికి, రవాణాకు సంకేతంగా భావిస్తారు. ఖర్జూరం చెట్టును కేవలం పండ్లకోసమే కాక నీడకోసం, పశువుల మేత, కలప, తాళ్ళకోసం, ఆయుధాల తయారీకి కూడా సుమేరియన్లు ఈ చెట్టును పెంచినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరంలో అనేక రకాలున్నాయి. కొలరాడో నదీ తీరాన వున్న బార్డ్ వ్యాలీలోని పామ్‌స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్ రకం ఖర్జూరానికి మరే రకం సాటిరావనేది ప్రతీతి. ముదురుగా, నున్నగా ఉండే బార్హీ అనే ఖర్జూరానిదని చెప్పవచ్చు. దీనే్న హనీబాల్ అని కూడా అంటారు. డెగ్లట్ నూర్ అనే ఖర్జూరం ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. ఖాద్రావి రకం రుచిగా ఉంటుంది. తేనెలా తియ్యగా ఉంటుంది హనీరకం. బ్లాక్ డేట్ నల్లని వర్ణంతో ఉండి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. గోల్డెన్ ప్రినె్సస్ రకం నమలడానికి అనువుగా ఉంటుంది. ఖుద్రానీ, రాజా ఖర్జూరం, జైదీ ఛోహారా, భూఖర్జూరీ.. ఇలా ఇంకా అనేక రకాలున్నాయి. ఖర్జూరంలో అనేక పోషక విలువలున్నాయి. వందగ్రాముల ఖర్జూరంలో 75 గ్రా. పిండి పదార్థం, చక్కెర 63 గ్రా., పీచు పదార్థం 8 గ్రా.. కొవ్వు పదార్థం 0.4 గ్రా., మాంసకృత్తులు 2.5 గా , నీరు 21 గ్రా. ఉన్నాయి. ఖర్జూరంలో అధికంగా ఇనుము ఉండటం వల్ల రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్యానికి కూడా ఖర్జూరాన్ని వాడతారు. పెద్ద పేగులోని సమస్యలకు ఈ పండుతో చేసిన టానిక్ తాగుతారు. గొంతునొప్పి, మంట, జలుబు ఇత్యాదివాటికి ఖర్జూరం గుజ్జు, సిరప్ మంచి మందు. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు దీని కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టు వేరును పెట్టుకుంటే పిప్పిపంటినొప్పి దూరమవుతుంది. ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఎముకలు బలంగా తయారవడానికి కూడా ఖర్జూరాన్ని తింటారు. ఉదరక్యాన్సర్ కూడా తగ్గుతుంది.

-షేక్ అబ్దుల్ హకీం జానీ