Others

ఓ సాహసమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దగా చదువుకోని కుటుంబంనుండి రంగుల ప్రపంచమైన సినిమా పరిశ్రమకి వచ్చి ‘‘నీవు నటిగా పనికిరావు’’అన్న దర్శకులు, అగ్ర నటులు, తోటి నటులు, నిర్మాతలతో ‘‘నీవంటి మహానటి లేదు’’ అనిపించుకున్న సావిత్రి జీవితగాథను ‘‘మహానటి’’ పేరుతో నిర్మించడం అభినందనీయం. తన పట్టుదల, ప్రతిభతో ‘నట జీవితంలో’ ఎవరెస్టుశిఖరం ఎక్కిన సావిత్రి స్వయంకృతమో, విధివంచితమో, తన నిజ జీవితంలో తీసుకున్న నిర్ణయాలతో అనేక ఒడిదుడుకులకు లోనై చివరి దశలో మరణించిన తీరు ఆమెను ఆరాధ్య నటిగా కొలచిన వారికి నిరాశను, ఆవేదనను మిగిల్చింది. ఆమెపై రకరకాల పుస్తకాలు, మాధ్యమాలలో అనేక కథనాలు వచ్చాయి. అయితే సినిమా మాధ్యం కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్నది. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి చూడాలంటే ఒకతరం వారు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం మానుకున్న స్థితి, మరోతరం ఇలాంటి పాత తరం నటి సిన్మాకు వస్తారన్న సందేహంతో రెండుతరాలను థియేటర్‌కు రప్పించడంలో ఈ చిత్రంలో చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. దేవతలా ఆరాధించిన ఒక మహానటి నట జీవితాన్ని, ‘నిజ జీవితాన్ని’ బేలన్సు చేస్తూ ముఖ్యమైన ఘట్టాలను మూడుగంటలపాటు ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు నాగ్‌అశ్విన్ చూపిన పనితీరు అద్భుతం.ఇక మహానటి సావిత్రిగా కీర్తిసురేష్ ఆ పాత్రలో ఒదిగిపోయి తన నట జీవితంలో ఎవరెస్టు శిఖరం ఎక్కినా, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అసాధారణ నటన ప్రదర్శించగా, సాధారణ జర్నలిస్టులుగా పెద్ద హీరోయిన్ సమంత, తక్కువ చిత్రాలతో ఎక్కువ పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సహజంగా నటించి ఈ తరం ప్రేక్షకులూ థియేటర్ వైపు రావడంలో తోడ్పడ్డారు. రాజేంద్రప్రసాద్ కొన్నిసార్లు హాస్యం, మరికొన్ని సార్లు కాఠిన్యం, చివరిలో కరుణ చూపిన తీరు అభినందనీయం. ఎస్.వి.ఆర్ పాత్రలో మోహన్‌బాబు ఇమిడిపోగా మిగిలినవారు వారి పాత్రలలో ఒదిగిపోయారు. బుర్రా రామమాధవ్ తన సంభాషణలతో మెప్పించగా, సంగీతం సమపాళ్ళలో అమరింది. కళా దర్శకత్వం, ఛాయాగ్రహణం అలనాటి సినిమా షూటింగులు, వాతావరణం చూపడంలో ఎంతో ప్రతిభ కనిపించింది. ఈ సినిమాలో అక్కడక్కడ దొర్లిన కొన్ని లోపాలు ముఖ్యమైన ఘట్టాల చిత్రీకరణ, ప్రేక్షకులను మూడు గంటలపాటు థియేటర్లలో ఆసక్తిగా కట్టిపడేసిన దర్శకత్వం, నటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితనం, ప్రేక్షకులను వాటిని పట్టించుకోనివ్వలేదు. న్యాయపరమైన, కుటుంబ సభ్యుల పరిమితుల వల్ల, సినిమాటిక్‌కోసం మనం చదివినా లేదా విన్న అంశాలకు భిన్నంగా కనిపించినా పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోలేదనే చెప్పాలి. ఇంత సాహసంగా ఒక మహానటి చిత్రాలన్ని నిర్మించిన నిర్మాతలు ఎంతైనా అభినందనీయులు. రంధ్రానే్వషణ మాని సావిత్రి అభిమానులుగా చూసిన వారందరినీ సంతృప్తి కలిగించిన చిత్రం, ఆ తరం- ఈ తరం కదిలి తిరిగి థియేటర్లకు తరలించిన చిత్రంగా చెప్పుకోవచ్చు.

- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ