Others

‘కల కానిది.. విలువైనది..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పాటలో ఆత్మవిశ్వాసం పెంచే గుణం అమితంగా ఉండడంవల్ల నాకు ఈ పాటంటే అపరిమితంగా ఇష్టం. ఈ పాట ప్రేరణవల్ల చాలా మంది నిరాశ నుండి బతుకుమీద ఆశతో పునర్జీవనం పొందారు. శ్రీశ్రీగారు మనసుని మథించి, జీవితాన్ని శోధించి రాసిన పాట ఇది. ఘంటసాలగారు తన మధుర స్వరంతో ఆర్ద్రతను రంగరించి పాటకు ప్రాణం పోశారు. పెండ్యాల నాగేశ్వరరావు సహజ రీతిగా స్వరపరచి పాటకు విలువను పెంచారు. ‘అగాథవౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే..’ అంటూ ఒక చరణంలో ఎంతటి బాధలోనైనా సుఖం దాగి ఉందని స్పష్టంగా చెప్పారు. ‘ఏదీ తనంత తానై నీ దరికి రాదు - శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం’ అంటూ మరొక చరణంలో సహేతుకంగా నిరూపించాడు. కథలో హీరోయిన్ తన భర్త చనిపోయాడని శోకిస్తుంటుంది. అలా వలదు.. నీ జీవిత గమ్యం వెతుక్కో- నీ జీవిత పరమార్థాన్ని కనుక్కో.. ఆ దిశగా పయనించు, శ్రమించి జీవితాన్ని పరిపుష్టం గావించుకో అన్న వాస్తవాన్ని మనం ఈ పాటలో గమనిస్తాం. ఇక్కడ చిన్నమాట. నా ఫ్రెండు సప్పరం మధుమోహన్ నిస్పృహలో ఉండగా నేను ఈ పాటను వినిపించి అర్థమయ్యేట్లు చెప్పి వివరించి అతన్ని ప్రస్తుతం వికాస్ కాలేజీలో లెక్చరర్‌గా చేర్పించాను. ఇదంతా ఆ పాట గొప్పతనం. అందుకే ఆ పాటంటే నాకు ఎంతో ఇష్టం.

-తణుకు మునిబాబు, నెల్లూరు