Others

స్కిప్పింగ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు శరీరానికి వ్యాయామం తప్పనిసరి. స్ర్తిలకు ఈ వ్యాయామం చేయడానికి పొద్దుపొద్దునే్న అంత టైమ్ ఉండదని అంటుంటారు. కాస్త టైము తీసుకొని నడక అలవాటు చేసుకోవడం అన్నింటికన్నా ఉత్తమం. అసలే టైము లేదనుకొనేవారు స్కిప్పింగ్ చేస్తే చాలా మంచిది. కొద్ది టైములోనే శరీరానికి ఫిట్‌నెస్ వచ్చేస్తుంది. బరువు కూడా తగ్గుతుంది. రోజూ అరగంటపాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆరోగ్యనిపుణులు సూచన చేస్తున్నారు.
స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గడమే కాదు.. ఊపిరితిత్తులకు మేలు చేసినవారవుతారు. ఇలా చేయడంతో తరచూ భుజాలు తిరుగుతుంటాయి. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి. చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. చిన్న వయసువారు స్కిప్పింగ్ అలవాటుచేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. ఇలా చేయడంవల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుందని వైద్యులు సలహా.