Others

లేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్విగ్న కెరటాలు ఎగసే వేళ
అలలు రాస్తున్న లేఖ ఇది
సంద్రం ఒక నీలి కాగితం
మది వూహల మధురోహల
సమ్మోహన కావ్యం
నిశిరాత్రుల కడలి చెలియలి
కట్టతో చెలరేగిన తతంగం
అప్పుడే విచ్చిన చంద్రుడి పువ్వులోని
పుప్పొడి సిరాతో రాసిన లేఖ
అనుభవాల, భావాల ఏరువాక
ఆలోచనల తరంగాలు నింగిని
తాకుతూ, నీటి పాదముల చెంత
లేఖలు పరిచింది.
దోచుకున్న వలపు ఆణిముత్యాలను
ఎడద ఆల్చిప్పలో దాచుకుంది
అక్షర గులకరాళ్లను నీటి పారదర్శకతలో
ప్రదర్శిస్తుంది.. పరవశిస్తుంది
కలల అలల కౌగిలి గిలిగింతలో
పులకించింది యామిని
అందాల బంధాల సొదలతో
లేఖలు చదువుతుంది వెనె్నల జవ్వని

- సముద్రాల శ్రీదేవి, 9949837743