Others

‘నిన్న చూసిన ఉదయం కాదిది’ (. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1996 అక్టోబర్ 17న విడుదలైన ‘చిన్నబ్బాయి’ చిత్రంలోని ‘నిన్న చూసిన ఉదయం కాదిది- కొత్తగా ఉంది, సరికొత్తగా ఉంది’అనే పాట ఇప్పటికీ వింటుంటే నిత్యనూతనంగా ఉంటుంది. రాశీ మూవీస్ పతాకంపై కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ వ్రాసిన ఈ పాట ‘సుజాత, ఎస్పీబాలు’ గొంతుల్లో ప్రాణం పోసుకుంది. వెంకటేష్, రమ్యకృష్ణలు నటించగా, ‘రమ్యకృష్ణ’ మాత్రం జీవించింది. నేనప్పుడే పీజీ పూర్తిచేసుకొని నేను చదివిన కాలేజీలోనే లెక్చరర్‌గా పార్ట్‌టైమ్‌గా పనిచేస్తూ సెకండ్‌షోకు వెళ్లినట్లు గుర్తు. సినిమా ఏమీ గుర్తులేకున్నా ఈ ‘సాంగ్’మాత్రం 22 ఏళ్ళ తర్వాత కూడా వెంటాడుతూనే వుంది అంటే ఆ పాట నామీద ఎంత ప్రభావం చూపిందో అర్ధంచేసుకోవచ్చు. రాత్రిపూట ఈ పాట వింటూ ఎన్నిసార్లు నిద్రపోయానో గుర్తులేదు. సంగీత, సాహిత్యాలు ఒక దానితోఒకటి పోటీపడితే ఇలాంటి గీతాలే వస్తాయి. వాయిద్యాల హోరు లేకుండా స్వచ్ఛంగా పల్లవి, చరణాలు వినసొంపుగా వినిపిస్తాయి. వెంకటేష్ ఏమో చాలా స్టయలిష్‌గా, యంగ్‌గా కన్పిస్తాడీ పాటలో. రమ్యకృష్ణ తన అందంతో ఆకట్టుకొంటూనే హీరోపై నున్న ప్రేమను ప్రదర్శిస్తూ వుంటుంది. అమాయకురాలైన హీరోయిన్‌ను ‘్ఫ్యషన్‌షో’లో పాల్గొనేలా హీరో ధైర్యం చెప్పడం, ‘ఈత’నేర్పించడం అన్ని ఫీలింగ్స్‌నూ దర్శకుడు కథానాయకీ నాయకుల చేత రాబట్టడం విశేషం. నేటికీ నా ‘కారు’లో ప్రయాణం చేసేటప్పుడు ఈ పాట పడాల్సిందే. జర్నీలో బడలిక తెలియకుండా చేసే పాటల్లో ఇదొకటని నేను ఈరోజుకూ నమ్ముతాను.

- కాళిదాసు విజయచంద్ర, కావలి, నెల్లూరు జిల్లా