AADIVAVRAM - Others

ఆచరణంలో సదాశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతకీర్తికి మనసంతా చికాకుగా వుంది. కళ్ళు మూసినా.. తెరచినా.. కలతగానేవుంది. తానొకటి తలిస్తే.. తన అనుకునే తనవారంతా తలో మూలనుంచి తలోమాట అంటూ, తన దృఢ నిశ్చయాన్ని, నిర్మలత్వాన్ని తూట్లుతూట్లుగా తూలనాడుతూనే వున్నారు మనసంతా తీవ్ర అశాంతికి లోనవుతోంది. ఇంతకీ తను తీసుకున్న నిర్ణయం వారి సగటు మనస్తత్వాలకి నచ్చినట్లుగా లేదు. ఇంతలో పాప రిమోటుతో టీవీ స్విచాన్ చేసింది. అసహనంగా పాపవైపు చూస్తూ, ఆ టీవీ కట్టెయ్ అన్నాను. పాప ఇది ఏమీ పట్టించుకోలేదు. టీవీలో తెలుగు సినిమా పాట వస్తోంది.
‘‘్ధరణికి గిరి భారమా.. గిరికి తరువు భారమా.. కనిపించే తల్లికి పిల్ల భారమా..’’ అసహనంగా వున్న శతకీర్తి మనసుకి! కాస్తంత ప్రశాంతత ఏర్పడింది. గతమంతా కళ్ళముందుకొస్తోంది.. కర్తవ్యం స్థిరంగా నిలిచి ముందుకు సాగింది వంటింటివైపుగా. పాప తన వెనకాతలే ఫాలో చేసింది. ‘‘అమ్మా! ఆకలి’’ అంటూ.. పాపకి కాసిన్ని పాలల్లో ఓట్సువేసిచ్చి, శంతన్‌కి ఫోన్ చేశాను. శంతన్ ఆఫీసులో ఏదో కాల్‌లో వున్నట్లున్నాడు. మళ్ళీ కాల్ చేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. శంతన్ వాళ్ళ చిన్ననాటి హెడ్ మిస్ట్రెస్ సుమతీ శంకరన్ ఫోన్‌లో నా హెల్త్ గురించి, మెడికల్ చెకప్ గురించి వివరంగా అడిగి తెలుసుకుంది. బై ది బై పాప, బాబు గురించి, శంతన్ గురించి అడిగింది. ఆమె బాగా మాలో ఒకరైపోయింది. కనీసం వారానికి ఒకసారైనా మంచీ, చెడ్డా మాట్లాడ్తుంటుంది. నెలకి రెండు, మూడుసార్లు మా యింటికి వస్తూ పోతూ వుంటారు ఆ దంపతులు.
‘‘అంత కలివిడిగా ఎందుకు రాసుకు, పూసుకు తిరుగుతుంటారు. ఆమె కళ్ళసలే మంచివి కావు, ఆమె దగ్గరకు అస్తమానం పిల్లల్ని పంపించకు. అసలే పిల్లా జెల్లా లేనిది. దిష్టిపెడ్తుంది’’ అంటూ వుంటాడు. శంతన్ పిన్ని వాళ్ళంతా.. ఆమెనే ఓరగా చూస్తూ. కానీ ఆమె స్వభావం అలా అనిపించదు, ఆమెకు పిల్లలంటే చాలా ముద్దూముచ్చట. యింతలో డ్రైవరు తిరుమలేశు వాకిట్లో కాలింగ్‌బెల్ నొక్కాడు. వాడు మధ్యాహ్నం శంతన్‌కి లంచ్ బాక్స్ యిచ్చేసి బాబుని స్కూలు నుంచి తీసుకువస్తాడు.
‘‘ఏమ్మా బాక్స్ రెడీ చేశారో.. బాబుగారు ఎదురుచూస్తుంటారు అంటూ.. పాపా.. పల్లు తిన్నావా?’’ సాగదీశాడు శ్రీకాకుళం యాసలో.. ఎవరి పల్లు అనుకునేరు.. వాడికి ‘‘ళ’’ పలకదు. వాడు పల్లు, బల్లు అంటుంటాడు. మాకు వాడొక కాలక్షేపం. వాడు గలగలా మాట్లాడ్తూ వుంటే మనసుకు కాస్త ఉల్లాసంతో తేలిగ్గా ఉంటుంది.
ఇంతలో పక్కింటి పంకజంగారు తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. వస్తూనే విసురుగా మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ఎదురింటి పిన్నిగారి మీద ఏకరువెట్టారు పితూరీలు. పిన్నిగారికి.. ఈమెగారికి.. బొత్తిగా పడదు. ఆమె ఆవాలంటే, ఈమె పేలాలంటారు. అప్పుడప్పుడూ వాళ్ళిద్దరూ నన్ను యిరికిస్తుంటారు. కరవమంటే పిన్నిగారికి కోపం.. విడవమంటే పంకజంగారికి రోషం. మొదట్లో నాకూ ఏదో కాలక్షేపంగా వుండేది. రానురాను తలనొప్పి కింద మారింది వాళిద్దరి మరస.
ఇవాల్టికి లంచ్ బాక్స్ యివ్వాలన్న సాకుతో తప్పించుకున్నా ఆమె బారి నుండి లంచ్ బాక్స్ సర్ది డ్రైవర్‌కి యిచ్చాను. వాడు అటూ ఇటూ చూస్తూ నిల్చున్నాడు కదలకుండా. ఏమిటన్న ప్రశ్న నా కళ్ళల్లోకి చూసి వాడు తడుముకుంటూ.. ‘‘అయ్యగారితో చెప్పి వెయ్యిరూపాయలు యిప్పించండమ్మా పండగకి పిల్లలు, అల్లుడు వస్తున్నారు22 అన్నాడు.
‘‘నా సిఫార్సు దేనికి? నీవే అడిగి తీసుకోవచ్చు కదా..’’ అన్నాను.
‘‘అడగచ్చుకానీ పాత బాకీ తీరకముందే అడిగితే కోప్పడ్తారమ్మా..’’2 అన్నాడు.
‘‘చెప్తాలే.. పద.. ఇప్పటికే ఆలస్యమైంది. అయ్యగారు ఆ కోపం, ఈ కోపం నా మీద చూపిస్తారు’’ అంటూ తలుపులు వేసుకుని బెడ్‌రూమ్ కేసి వెళ్ళాను కాస్త నడుము వాలుద్దామని.
‘‘మెడికల్ చెకప్‌కి వెళ్ళావా.. డాక్టర్ ఏమన్నాది?’’ శంతన్ ఫోన్ చేశాడు.
‘‘ఏమంటుంది పాత సి.డి. వేసింది. బలానికి మందులు రాసిచ్చింది. బాగా రెస్టు తీసుకోమంది. ఇంచుమించు బెడ్ రెస్టనుకోండి’’ అంది శతకీర్తి.
‘‘మొదటినుంచి డాక్టర్ కాన్పు కష్టం. అబార్షన్ చేస్తాను అన్నది, నువ్వే మొండి పట్టు పట్టావ్..’’ బాధపడ్డాడు శంతన్.
మళ్ళీ మీరు మొదలెట్టారు..2అంటుంటే శతకీర్తి కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయ్. అది గ్రహించి4‘‘శంతన్ ప్రసంగాన్ని మార్చి, సరేకానీ ఇవేమీ మనసులో పెట్టుకోకు. హాయిగా భోంచేసి రెస్ట్ తీసుకో.. ఈలోపు బాబు స్కూలు నుంచి వస్తాడు. సాయంత్రం అలా బయటికి వెళ్ళి ఏదైనా హోటల్లో డిన్నర్ చేసొద్దాం’’ అంటూ ధైర్యం చెప్పాడు.
వాల్‌క్లాక్ ముళ్ళు గిరగిరా తిరగటం, క్యాలెండర్‌లో నెలలు వేగంగా మారిపోవడం జరిగిపోయినయ్. డాక్టర్ డెలివరీకి యిచ్చిన టైమ్‌రానే వచ్చింది.
‘‘శంతన్.. మీ హెడ్‌మిస్ట్రెస్ సుమతీ శంకరన్‌లకి ఆ రోజు వాళ్ళిద్దరినీ హాస్పిటల్‌లో వుండేలా చెప్పండి. ఆ తరువాత ప్రొసీజరంతా వాళ్ళేగా చూసుకోవాలి’’ అన్నది శతకీర్తి ఆర్ద్రత నిండిన కంఠంతో, కళ్ళు చీరకొంగుతో తుడుచుకుంటూ..
డాక్టరమ్మ చెప్పిన ప్రకారం ఆ శుభ ఘడియలో శతకీర్తి ప్రసవించింది. బేబీ.. మొగ్గలు రేకులిచ్చుకున్నట్లు.. కళ్ళు విప్పారి.. ఈ లోకంలోకి వచ్చి, వెలుగులు చూస్తోంది. మగత వీడిన శతకీర్తి సుమతిగారిని దగ్గరగా రమ్మని సైగచేసింది. సుమతిగారు శతకీర్తి కోరిక మేరకు దగ్గరగా వచ్చి కృతజ్ఞత నిండిన కళ్ళతో పలకరించింది.
‘‘శంతన్.. సుమతి శంకరన్‌గార్లతో పాప బర్త్ సర్ట్ఫికెట్ ఫిల్ చేయించండి’’ అంది శతకీర్తి దుఃఖానికి లోపలే అణుచుకుంటూ.
‘‘దానికి యిప్పుడే తొందరేంటి శతకీర్తి.. నీవు ఆరోగ్యంగా యింటికి వెళ్ళాక..’’ అంటూ నీళ్ళు నమిలింది.
‘‘లేదు లేదు.. నా మనసు మారకముందే.. పొత్తిళ్ళల్లో బిడ్డని చూపిస్తూ.. మీ బిడ్డని మీరు తీసుకెళ్ళడం అన్ని విధాలా అందరికీ శ్రేయస్కరం..’’ అంటూ సుదీర్ఘంగా శ్వాస తీసుకుంది శతకీర్తి.
ఆకాశమంతా ప్రశాంతంగా వుంది. పూలవాన తుంపరగా నేలని తాకుతోంది.. మట్టిని చీల్చుకుని విత్తులు మొలకలెత్తుతున్నాయ్!! గువ్వలు తమ తమ పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్నాయ్..!!!
మొగ్గలు అప్పుడే.. అప్పుడే.. రేకులిచ్చుకుంటున్నాయ్.. కొత్తగా వుంది ఈ లోకం..
సుమతీశంకరన్ పొత్తిళ్ళల్లో పాపని గుండెలకి హత్తుకుంటుంటే.. ఆమె కళ్ళల్లో ప్రకాశమవుతున్న మెరుపు స్పష్టంగా కనపడుతోంది శతకీర్తికి.. కొంగ్రొత్తగా అనిపించింది ఈ అనుభవం.. నెరవేరింది శతకీర్తి ఆశయం..

-ఆచార్య క్రిష్ణోదయ