AADIVAVRAM - Others

ఇదిగిదిగో.. డిజిటల్ ఇండియా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2022 నాటికి మన దేశంలో అంతర్జాల వినిగదారుల సంఖ్య 500 మిలియన్‌ల పైబడుతుంది. అత్యధికంగా మొబైల్ ఫోన్‌లలో ఇంటర్నెట్ వినియోగం దూసుకుపోతోంది. మన దేశ జనాభాలో మహా నగరాలు, పట్టణాలు పల్లెల మధ్య డిజిటల్ విప్లవానికి సంబంధించి పెను అగాధం నెలకొని ఉంది. నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక అసమానతలు, అసంఘటిత శ్రామిక రంగం, నిరుద్యోగం తాండవిస్తున్న మన దేశంలో తొంభై కోట్ల మంది సామాన్య జనావళికి అంతర్జాల వినియోగం అందుబాటులో లేదు. రోజువారీ లెక్కల కష్టంతో జీవించే అసంఖ్యాక నిరుపేదలను రాత్రికి రాత్రి డిజిటల్ జీవన విధానం అలవాటు చేయాలని ఆశించటం సమంజసం అయినా, సాధ్యం కాదు.
ప్రపంచం, ఇంటర్నెట్ లేకుండా జీవించలేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని వున్నాయి. గ్లోబల్ సర్వే ప్రకారం ఇండియా, ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో ఇప్పటికే రెండవ పెద్ద దేశంగా గుర్తింపబడుతోంది. కాని కేవలం దేశ జనాభాలో 26 శాతం మాత్రమే ఇంటర్నెట్ బాంధవ్యం కలిగివున్నారు. చైనాలో ఇంటర్నెట్ వినియోగదారులు 731.43 మిలియన్, యు.ఎస్‌లో 286.94, బ్రెజిల్ 139.11, ఇండోనేషియా 132.7 కాగా, 2015 గణాంకాల ప్రకారం ఇండియాలో 462.12 మిలియన్ స్థాయిలో వున్నారు. 2011 నుంచి గత ఐదేళ్లలో 10 శాతం వినియోగం నుంచి శరవేగంగా పెరుగుతోంది. వినియోగదారులలో పురుష శాతం 71 శాతం కాగా, మహిళలు 29శాతం వున్నారు. 23 దేశాలలో నిర్వహించిన సర్వే ప్రకారం, ఇంటర్నెట్ లేనిదే బతుకులేదని భావించే ప్రేమికులు యుకె, చైనా, జర్మనీ, యుఎస్ కంటే మన దేశంలోనే 82 శాతం అత్యధికంగా ఉండటం గమనార్హం. 2016 లెక్కల ప్రకారం, మొబైల్ ఫోన్‌ల ఇంటర్నెట్ బాంధవ్యం జనాభాలో 24.3శాతం, 323 మిలియన్ సంఖ్యకు చేరింది. సోషల్ నెట్ వర్కింగ్‌లో ఫేస్‌బుక్ వినియోగదారులు 195 మిలియన్ కాగా ఇతర వాట్స్‌అప్, గూగ్లీ, స్కైప్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, రిటైల్ ఇ-కామర్స్ అమ్మకాలు రానున్న 2021 నాటికి 45 బిలియన్ డాలర్ల స్థాయి చేరే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ప్రపంచంలో తొలి అయిదు అగ్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా ఆవిర్భవించింది. మార్కెట్ రీసెర్చి కంపెనీ న్యూవరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 10 దేశాలలో 2017 నాటికి 215 ట్రిలియన్ డాలర్ల ప్రైవేటు సంపద, 73.5 శాతం వ్యవస్థీకృతమైంది. వాటిలో ఒకటైన ఇండియాకు సంబంధించి 2017-2027 దశాబ్దం నాటికి 8.20 ట్రిలియన్ డాలర్ల నుంచి 200 శాతం పెరిగి 24.70 ట్రిలియన్ డాలర్ల సిరిసంపదలు ప్రైవేటు రంగ పరమయ్యే డిజిటల్ విప్లవాన్ని సాంకేతిక ప్రజ్వలనం ఆహ్వానిస్తోంది. దేశంలో కేరళ మహిళలు అత్యధిక శాతం మొబైల్ ఫోన్‌లు వినియోగిస్తుండగా దేశం మొత్తంలో 46 శాతం మహిళల చేతులలో మొబైల్స్ వున్నాయి.
ప్రథమ పారిశ్రామిక విప్లవం స్టీమ్ ఇంజన్, ద్వితీయ విప్లవం విద్యుత్, తృతీయ దశలో 1960నుంచి క్రమేపీ కంప్యూటర్లు, డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, ప్రస్తుత నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని రోబోట్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పది, సాంకేతిక ప్రక్రియలవైపు నడిపిస్తోంది. మెకినే్స నివేదిక ప్రకారం 2030 సమీప భవిష్యత్తు నాటికి, ప్రపంచ వ్యాప్తంగా ఆటోమేషన్ కారణంగా 400-800 మిలియన్ జనావళి కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందటానికి పునర్ నైపుణ్యం, శిక్షణ వెదుక్కోవలసి అగత్యం సంప్రాప్తిస్తోంది. 2030 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థకు ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)వల్ల 957 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకొనే అవకాశాలున్నాయి.
ఇక భారతీయ విద్యావిధానం డిగ్రీలు కాకుండా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరవ తరగతినుంచే ప్రయోగశాలలో రోబోట్స్, 3డి ప్రింటర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెంటార్స్ ప్రవేశించాలి. న్యూటెక్నాలజీ నైపుణ్యం, మల్టీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ డిజిటల్ టాస్క్స్, బ్లాక్ చైన్, ఎఐ టెక్నాలజీని ఆహ్వానించాలి. నాల్గవ పారిశ్రామిక విప్లవానికి అడుగులు పడాలంటే ప్రస్తుత భారతావనిని డిజిటల్ ఇండియాగా యావద్భారతాన్ని సాంకేతిక సమాయత్తంతో జన జీవనాన్ని ప్రభావితం చేయాలి.

-జయసూర్య