Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

8. తులసీ పత్రం- తులసి దళములు (Ocimum Vilosum) :- దీని ఆకు రసము లేక కషాయము కొంచెము చేదుగా, కారముగా వుంటుంది. ఉష్ణము చేస్తుంది. జ్వరమును, కఫవాతాలను, శే్లష్మము, దగ్గు, క్రిమిరోగమును పోగొట్టుతుంది. రుచి పుట్టిస్తుంది. బుద్ధిని పెంచుతుంది. జఠర దీప్తినిస్తుంది. తులసిని దొడ్లలోవేసి పెంచితే దాని గాలివలన విశూచి మొదలగు అంటువ్యాధులు నివారించబడుతాయి.
9. చూతపత్రం - మామిడి ఆకు (Mangnifera Indica) :- పచ్చి మామిడాకు చుట్టచుట్టి చివర పంటితో కొరికి దానితో దంత ధావనము చేస్తే నోరు శుభ్రముగా, మనోహరముగ వుంటుంది. దంతములకు, చిగుళ్ళకు బలముచేస్తుంది. మామిడాకుల కషాయము పుక్కిళిస్తే దంతరోగాలు, చిగుళ్ళవాపు, నొప్పులు, నోటిపూత నెమ్మదిస్తుంది. మామిడాకు విస్తరిలో భోజనము రుచి పుట్టిస్తుంది. సమస్త దోషాలను, పిత్తరోగాలను హరిస్తుంది. మేహకారక మంటలను, రక్తాతిసారములను జయిస్తుంది.
10. కరవీర పత్రం- గనే్నరు (Plumieria alba) :- దీని వేరు లేక మ్రాను చెక్క నూరి కడితే, గడ్డలు, కంతులు హరిస్తాయి. దీని మ్రానుచెక్క, లేక వేరు చెక్క లేక ఆకులు నూరి నూనెలోవేసి కాచి పూస్తే కుష్ఠు, దద్దుర్లు, దురదలు, జంతు విషము హరిస్తుంది. మోతాదు ఎక్కువైతే ఇది విషమే.
11. విష్ణుక్రాన్త పత్రం - విష్ణుక్రాంతము (Evolvulus alsinoides) :- ఇది సన్నని ఆకులుగల నేలమీద ప్రాకే చిన్న తీగ. దీని కషాయం పైత్య, కఫ, జ్వరాలను, పురాణ అంతర్గత జ్వరాలను, ఉబ్బును పోగొడుతుంది. మూత్ర విరేచనాలను ఆపుచేస్తుంది. దీని యెండించిన ఆకుల పొగ పీల్చుకొంటే ఓగర్పుగల దగ్గు(Bronchitis) ఉబ్బసపు దగ్గు (Asthma) నిమ్మళిస్తాయి.
12. దాడిమీపత్రం- దానిమ్మాకు (Punica Granatum) :- దీని ఆకు రసము లేక లేత కాయల రసము గ్రహణిని, రక్తగ్రహణిని, నీళ్ళ విరేచనాలను కట్టిస్తుంది. పుక్కిళించిన నోటి పూత నిమ్మళిస్తుంది. వేరు చెక్క కషాయము క్రిమిని, ఏలికపామును నాడాపామును చంపుతుంది. లేక ఆకుల రసం 3-4 చుక్కలు ముక్కులో పోసిన ముక్కువెంట రక్తము పడుట కడుతుంది. దానిమ్మ కాయలపై చర్మము పచ్చిది గాని, యెండించినది గాని, రసము గాని అరుచి, గుల్మము, శూల, ప్రమేహము, అతిసారము, రక్తముపడు మూలవ్యాధి, విదాహములను అణచివేస్తుంది.
13. దేవదారు పత్రం- దేవదారి ఆకు (A medical Small tree available in forests) :- ఇది ఒక చిన్న చెట్టు. దీని ఆకులు గోరింటాకుల వలె చిన్నవిగా వుంటాయి. దీని చెక్క, ఆకురసము లేక కషాయము చేదుగ వుంటుంది. శీతపైత్య జ్వరము, శే్లష్మ వాతము, ఆమ దోషము, క్రిమిని పోగొడుతుంది. ప్రమేహము, కుసమ రోగాలను జయిస్తుంది. దీని లేత ఆకులు, చిగుళ్ళుచలవ, మేహశాంతి చేస్తాయి. వీనిని నలగగొట్టి నూనెలోవేసి కాచి తల అంటుకొనిన కళ్ళకు చలవ చేస్తుంది.
14. మరువక పత్రం- మరువము (Sweet Marjoram) :- ఇవి మంచి సువాసనగల మొక్కలు. సువాసన కొరకు స్ర్తిలు శిరస్సున ధరిస్తారు. మనస్సుకు సంతోషమును ఆనందమును కలుగచేస్తుంది. దీని సమూలపు రసము లేక కషాయము వగరుగ చేదుగ వుంటుంది. వేడి చేస్తుంది. పైత్యము, శే్లష్మము, విషము, మేహము, కార్మ్యరోగము, క్షయ రోగములను పోగొడుతుంది. పైత్య భ్రమ, దాహము, తాపములను అణుస్తుంది. దీనిని తైలములో వేసి కాచి వాడిన సువాసన గలిగి మెదడుకు చలువ, వెంట్రుకలను వృద్ధిచేస్తుంది.
15. సిన్దువారపత్రం- వావిలాకు (Vitex negundo.V.Paniculate) - ధీని వేరు కషాయము చేదుగ వగరుగ వుంటుంది. ఇది వరుస జ్వరము, దోష జ్వరము (Typhus fever), క్రిమిరోగము, ఉబ్బురోగాలను జయిస్తుంది. దీని పచ్చి ఆకులను వెచ్చచేసి కట్టిన వాత, మేహవాత నొప్పులు, ఇరుకు నొప్పులు, కీళ్ళనొప్పులు వాపు, సెగ రోగములను హరిస్తాయి. దీని ఆకు రసము చెవిలో పోసిన కర్ణరోగాలు హరిస్తాయి. దీని యెండిన ఆకుల పొగ పీల్చుకొనిన దగ్గు, తలనొప్పి నిమ్మళిస్తాయి.
16. జాతీపత్రం - జాజి ఆకు (Jasminum Grandiflorum) :- దీని వేరు కషాయము లేక ఆకురసము చేదుగా, వెగటుగా వుంటుంది. వాత పైత్యము, కఫము, రక్తకఫము, ముఖ రోగము, దంత రోగము, శిరో రోగాలను హరిస్తుంది. వ్రణాలకు దీని ఆకు నూరి కట్టుకట్టిన నయమవుతాయి. దీని వేరు చూర్ణముతో పండ్లు తోమిన దంత రోగాలు హరిస్తాయి.
17. గణకీ పత్రం- గణికా (అడవి మొల్ల) (Jasminum Auriculatum) :- దీని వేరు విరేచన బద్ధమును హరిస్తుంది. చలవ చేస్తుంది. సంగ్రహణి రోగము, కఫవాతము, దాహము రక్తపైత్యములను శమింపచేస్తుంది.
18. శమీపత్రం - జమ్మిపత్రి (Acacia Suma, Mimosa Suma) :- దీని ఆకు లేక చెక్కరసము లేక కషాయము వెగటుగ, కారముగ వుంటుంది. వేడి చేస్తుంది, వెంట్రుకలూడ చేస్తుంది. శ్వాస, కుష్ఠు, మూలవ్యాధి, కఫములను హరిస్తుంది. దీని చెక్క దంత రోగాలను పోగొడుతుంది.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి