Others
భవిష్యత్తు చిత్రపటం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 June 2018
- డా. వి. గంగారావు, 9948875892

మనిషిగా పుట్టి
మట్టిమీద పాదం మోపి
కులాల కుంపటిలో కుమిలి కుమిలి
కన్నీటి సంద్రంలో తడిసి తడిసి
వెక్కిరిస్తున్న లోకాన్ని చూసి
వౌనంగానైనా సరే నడక సాగించినం
మైలురాళ్ల ప్రయాణంలో
మనుగడ సాగిస్తూ
జీవితమనే ప్రయాణంలో
గుణపాఠాలెన్నో నేర్చుకుని
అంధకారం కప్పిన చీకటి దుప్పటిని
మా కవనమనే కాంతిపుంజంతో
చీకటిని చీల్చుకుంటూ
వేలవేల వెలుగులు విరజిమ్ముతూ
మారనివి మా తలరాతలన్న
ఘనీభవించిన గత చరిత్రను
నిప్పుల కంటి సెగలతో కాలరాస్తూ
భవిష్యత్తు చిత్రపటంపై
మా వారసుల భావి జీవితాల
చెరగని చిరునవ్వుల చిత్రాలను లిఖించడానికి
చెదలు పట్టిన చరిత్రను
తిరగరాయడానికి వస్తున్నం.