Others

పువ్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పువ్వుల్ని చూడగానే
మహాత్ములు గుర్తుకొస్తారు నాకు
బాగున్నావా అని ఆప్యాయంగా వారు
పలకరిస్తున్నట్లుంటుంది నా మనసుకు
అయ్యో, నేనెప్పుడైనా ఈ దేశానికి
కాస్త పరిమళం పంచానా అని దిగులుపడుతుంటాను
పరిమళాల మాట అట్లా ఉంచితే
దేశానికీ నేనంటించిన మురికి గురించి సిగ్గుపడుతుంటాను...

పువ్వుల్ని అర్థం చేసుకోవాలంటే
ప్రాణాలున్నంత మాత్రాన సరిపోదు
పచ్చగా బతుకుతుండాలి, పదిమందినీ
పచ్చగా బతికిస్తుండాలి...

పువ్వులే గదా అనుకుంటున్నారా
కరకు కంపు ముళ్లను ఓడించే
ప్రవహిస్తున్న పరిమళాల ప్రేమికులు
దండయాత్రలు చేస్తున్న వడగాలుల్ని
మృదువైన ఆయుధాలతో జయంచే నవ్వుల సైనికులు

పువ్వుల్ని
తూకమెయ్యటం తప్పు
పైగా రాళ్ళతో తూకమెయ్యటం ఇంకా పెద్ద తప్పు.

- డా. రావి రంగారావు, 9247581825