Others

నాది తెలుగు భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష మనది వెలుగు బావుటా మనది
తెలుగు పలుకే పలుకు తీయ తేనియలు చిలుకు
నుడికారపు సొంపు వీనులకు ఇంపు

కోటి వీణల స్వరము తెలుగు కోయిల గానము
తొలి తెలుగు పదము నాగబు నవ్య పద సంపద మనది
ఖండాంతర ఖ్యాతి అఖండ కావ్య సంపత్తి

ఆదికవి నన్నయ్య సూక్తి నిధిత్వము
సహజకవి పోతన్న పద లాలిత్యము
అలమేలుమంగ పదమున అన్నమయ్య పదాలు
మువ్వగోపాలుని సొత్తు క్షేత్రయ్య పదాలు

తెలుగు పూదోటలో విరజాజి గురజాడ
పల్లె సొగసుల పక్షము దేవులపల్లి
మనసు కవి ఆత్రేయ మన కవి శ్రీశ్రీ
సమగ్ర సాహితీమూర్తి ఆరుద్ర

సావధానముగా వినండి మనదే అవధానము
నాటి తిరుపతి కవులు మేటి గరికపాటి
ఆశుకవితా ధార అనితరసాధ్యము
సహస్రావధానము అది మనకే సాధ్యము

గోదారి కెరటాల తేరు మీద ఉయ్యాల లూగేటి తెలుగు గీతం
చైత్ర వసంతోత్సవ కోకిల గానమై, వాయులీనమై
రస హృదయాలను దోస్తుంది కలకాలం నిలుస్తుంది

చిట్టి పొట్లకాయ, సిరిసిరి సింగణావత్తి
గుడిగుడిగుంచాలు, గుజ్జనగూళ్లు
చింతపిక్కలాట, బొంగరాలాట
తెలుగు ఆటలు మావి, పౌరుషాల కొలిమి

దేశదేశాలలో వైద్యులము మేమే, సాఫ్టు వీరులము మేమే
భావసంపదలోను, శీల సంపదలోను వెలుగు జాతి మాది
నేల నలుచెరగులా వ్యాపించి ఉన్నాము, మంచిని పంచాము
అమ్మ భాషను నిత్యము స్మరియిస్తూ ఉన్నాము
తెలుగు తల్లికి పుట్టి, తెలుగు నేలను నడచి
తెలుగు గాలిని పీల్చి, తెలుగు బువ్వను మెక్కి
తెలుగు పలుకని మూఢుడు, వెలుగు చూడని అంధుడు
బంతి భోజనమున కసవు నమిలే మూర్ఖుడు.

అమ్మ పదములకు మ్రొక్కి అమ్మ భాషను పలికి
మాతృభాషలోనే కుశలముగా చదువుకొని,
తెలుగు తేజము మీర జగతిలోన
ఖ్యాతి నొందుట ఖాయము తెలుగు బాల.
*

-బాలాంత్రపు వరాహ లక్ష్మీనరసింహ మూర్తి