Others

పాదం పదిలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన బరువంతా మోసేవి పాదాలే. అలాంటి పాదాల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. పాదంలో స్పర్శ నాడులు తక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ ఎంత ఒత్తిడి పడినా ఒక పట్టాన మనకు తెలియదు. ఒకే కాలుపై బరువు పెట్టి నిలుచుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. దానివల్ల కాలి ఎముకపైనా, మడమపైనా ఒత్తిడి ఎక్కువై ఎముక చిట్లడం, అరికాలిలో పుండ్లు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనినుంచి విముక్తి పొందేందుకు కొత్తగా మార్కెట్లోకి ప్రెషర్ సెన్సింగ్ స్టాకింగ్స్ రాబోతున్నాయి. ఈ సాక్స్ ధరిస్తే కాలిపై ఏ భాగంలో ఒత్తిడి పడుతోందో గమనించి ఇట్టే మన సెల్‌ఫోన్‌కి మెసేజ్‌లు పంపిస్తాయి. జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫెర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిలికేట్ రీసెర్చి రూపొందించిన ఈ సాక్స్‌లో కాటన్ వస్త్రంతో చేసిన రెండు పొరలు ఉంటాయి. ఈ రెండింటికీ మధ్య సిలికాన్ ఫిల్మ్‌ను అమరుస్తారు. ఫిల్మ్‌పై 40 డై ఎలక్ట్రిక్ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. కాలిపై ఏ భాగంపై ఒత్తిడి పడితే ఆ భాగంలోని ఎలక్ట్రోడ్ నుంచి సంకేతాలు మొబైల్ ఫోన్‌కి అలెర్ట్ మెసేజ్ రూపంలో అందుతాయి. ఈ సాక్స్‌ను హాయిగా ఉతికి ఆరేసుకోవచ్చు కూడా. డయాబెటిక్ రోగులకు, అథ్లెట్లకు కూడా ఈ సాక్స్ ఉపయోగకరంగా ఉంటాయి.