Others

నాడు-నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- అనాగరికుడుగా ఉండి
ఆకులు అలములు తిన్నావు నాడు..
నాగరికత పేరుతో
నక్షత్రపు హోటల్‌లో
అవే ఆకులు, అలాలను
వెజిటబుల్ సూప్ పేరుతో
తాగుతున్నావు నేడు..

- సైకిలెక్కి సక్కంగా
సంత కెల్లేటోడివి
సరుకులన్నీ తెచ్చేటోడివి
నాడు..
ఇరుకు గదిలో
కదలని సైకిలు తొక్కి
కొవ్వు కరుగతలేదంటూ
కెవ్వు కెవ్వు మంటావు నేడు..

- పనికొఱకు పగలంతా తిరిగేవు
అయిన జానెడు పొట్ట
నిండడం కష్టమే నంటవు నాడు..

పైసలెక్కువైతే
అదే రోడ్లపైన
మార్నింగ్ వాక్ అని
వంటినంత పట్టిన
కొవ్వును తగ్గించాలని
చూస్తవు నేడు..

- డబ్బులేకుంటే
పెళ్ళాం బంట్రోతు అంటావు నాడు
డబ్బుంటే
బంట్రోతే ఇల్లాలు అంటావు నేడు

- పేదవాడికి పట్టెడు అన్నం
పెట్టము కానీ!
పెయింటింగులో
పేదరికంలో ఉన్న
పేదవాన్ని గీసి
పైకానికి అమ్ముకుంటము..

పోయే కాలం
అంటే ఇదేనేమో!

-ఉషశ్రీ తాల్క