Others

విధివంచిత కాదు, విద్యాసమన్విత ‘నాచి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాచి’2 తెలుగువారంతా గర్వించదగిన క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందిన విదుషీమణి. ఏలేశ్వరోపాధ్యాయులవారి సంతానం. ఏలేశ్వరోపాధ్యాయులంటే వేదవేదాంగపారంగతులు. సర్వశాస్తమ్రులలో నిష్ణాతులు. నాడు శాస్త్రంలో ఎవరికి ఏ అనుమానం వచ్చినవారు తీర్చవలసిందే. అందుకే ఇప్పటికీ ఎవరన్నా, ఏదయినా విషయం మీద సాధికారికంగా చెపుతూంటే నీవేమన్నా ఏలేశ్వరోపాధ్యాయుడవా అనడం కద్దు! వీరిది పల్నాడు ప్రాంతంలోని (గుంటూరు జిల్లా) ఏలేశ్వరము. ఏలేశ్వరోపాధ్యాయులవారికి ముగ్గురూ కుమార్తెలే. పురుష సంతతి లేదు. ‘నాచి’ వారికి ద్వితీయ కుమార్తె. ఆమెకు చిన్నవయస్సులోనే వివాహమైంది. దురదృష్టవశాత్తూ కొంతకాలానికే భర్త మరణించాడు. వితంతువుగా పుట్టిల్లు చేరింది. పుట్టెడు దుఃఖంలో మునిగిన దశలో ఆమెకు చదువు ఒక ఆశారేఖగా తోచింది. నిరంతరం తండి ఏలేశ్వరోపాధ్యాయులవారి సమక్షంలో విద్యార్థులు వల్లించే శాస్త్ర పాఠాలు ఆమెలోని జిజ్ఞాసను తట్టిలేపాయి. ఆమెనూ విజ్ఞాన సముపార్జనవైపు అడుగులేయించాయి. తండ్రి అసమాన ప్రోత్సాహం తోడై అనతికాలంలోనే నాచి గొప్ప విద్వాంసురాలిగా పేరు తెచ్చుకుంది.
నాచి మొదటి నుంచీ మేధావి కాదనీ, జ్యోతిష్మతి అనే ఆయుర్వేద మూలిక ప్రభావంతో అసమాన మేథాసంపత్తినార్జించిందనీ లోకంలో ఒక కథ వాడుకలో ఉంది. ఇది అంత నమ్మశక్యంగా లేదు. గొప్పవారైన వారి గురించి ఇలాంటి ఆధారంలేని గాథలెన్నో పుడుతూ ఉంటాయి. తండ్రిగారి గురుత్వం వల్ల, తన కఠోరమైన సాధన వల్ల మాత్రమే ఆమె అంత విద్యనార్జించిందనీ నా నమ్మకం.
ఇంతటి అసమాన విద్యా వైదుష్యం సాధించాక నాచి వివిధ నగరాలలోని పండితులతో శాస్త్ర చర్చలు చేసింది. అనేకమంది కాశీ పండితులను సైతం తన వాదంతో ఓడించింది. జయపతి కలనందుకుంది. అనేక బహుమానాలను, సన్మానాలను పొందింది. ఆమె జైత్రయాత్ర ప్రయాగ, మైసూరు, ఢిల్లీ, ఆగ్రా వంటి మహానగరాలకు కూడా విస్తరించింది. అనేక రాజ సభలలో గొప్ప గొప్ప పండితులను ఓడించి ఘన సన్మానాలనందుకుంది. ఎప్పుడో వెయ్యేళ్ళకు ముందు స్ర్తీలు గడప దాటడానికే భయపడే రోజులో నాచి2దాదాపు భారతదేశమంతా పర్యటించి అఖండఖ్యాతిని గడించిందనే విషయం తెలుగు వాళ్ళమైన మనకెంతో ఆనందాన్నీ, గర్వాన్నీ కలిగించక మానదు. నాచి సంస్కృతంలో నాచీ2 పేరుతో గొప్ప కరుణ రసాత్మక నాటకాన్ని రచించింది. ఇతివృత్తం నాడు వితంతువులు సమాజంలో పడుతున్న బాధలు.. అది ఒకరకంగా ఆమె కథే. కానీ ఈ నాటకం ఇప్పుడు అలభ్యం. సంస్కృత నాటకకర్తగా నాచి పేరు అజరామరం. పరిస్థితుల ప్రాబల్యం వల్ల కష్టాల కడిలిలో చిక్కుకున్న వనితలకు నాచి చరిత , ఒక స్ఫూర్తిదాయక పాఠ్యాంశం. జీవితంలో కలిగిన గొప్ప లోటును అధిగమించి, నిలిచి గెలిచిన నాచి విధివంచిత కాదు.. విద్యాసమన్విత.
*
(ఆంధ్రభూమి పూర్వసంపాదకులైన కీ.శే. ఆంధ్రశేషగిరిరావుగారి
‘ ఆంధ్ర విదుషీమణులు’ గ్రంథం ఆధారంగా)

-డి.వి.ఎం. సత్యనారాయణ 98858 46949