Others

గోరింటా పూసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరింటాకు పెట్టుకోవడం శుభసూచకం. పడతుల్లో మరెన్నో నమ్మకాలు ఉన్నాయి. పాదాలకు పారాణిగా, అరచేతులకు అలంకరణగాను గోరింటాకు సుపరిచితమే. తక్కువ స్థలంలోనే గుబురుగా పెరిగే మొక్క గోరింట. మగువ మనసుకు ముచ్చట కలిగించేది గోరింట. అతివల చేతుల్లో మందారంలా పూసి, అందరిని మురిసిపోయేలా చేస్తుంది. ఆకులను మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్‌ని కావలసిన ఆకారంలో చేతులకు, పాదాలకు అలంకరించుకుని గంటపాటూ ఉంచితే ఎరుపు రంగులోకి మారుతుంది. గోరింట అలంకరణకు, అందం రెట్టింపు చేయడానికే కాకుండా ఆరోగ్యానికి సైతం ఉపయోగపడుతుందని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలున్న కారణంగా నెలకొక్కసారి అయినా పెట్టుకోవాలని వీరు సూచిస్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడంవల్ల గోళ్ళలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా పలు అలెర్జీలను దూరం చేయవచ్చు. ఏ కారణం చేతనైనా చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టడానికి గోరింటాకు బాగా నూరి పూస్తే సరిపోతుంది. వేడిగడ్డలను సైతం గోరింటాకు నయం చేస్తుంది. ఇది గోరుచుట్టు, కాళ్ల పగుళ్లకు సహజ సిద్ధమైన నివారిణి అని చెప్పవచ్చు. గోరింటాకు పేస్టుతో తలకు ప్యాక్ వేసుకుంటే జుత్తు ఆరోగ్యకరంగా కాంతులీనుతుంది. జుత్తు రాలడం, చుండ్రు లాంటి సమస్యలను సమూలంగా నివారిస్తుంది.
గోరింటాకు యాంటి బయాటిక్ లక్షణాలు కలిగి ఉండడం చేత క్రిములను దరిచేరనీయకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నచోట గోరింటాకు పేస్టును రాసి కాసేపు ఉంచితే ఫలితం కనబడుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. గోరింట బెరడుతో కాచిన కషాయం రక్తవిరోచనాలను ఇట్టే నివారిస్తుంది. గోరింట పువ్వులను నూరి వెనిగర్‌తో కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. పైగా సుఖనిద్రకు ఉపకరిస్తుంది. పలు చర్మ సమస్యలను గోరింటాకు ముద్ద పనిచేస్తుంది. ఆవనూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు పెరగడమే కాక మృదువుగా మారుతాయి. విత్త
నాలు దుర్వాసన తొలగించే డియోడరెంట్‌గా వాడుతారు. పువ్వులలో నుంచి తీసిన నూనెలు పర్‌ఫ్యూమ్స్‌గా వినియోగిస్తారు. చెట్టు బెరడు పచ్చకామెర్లను, కాలేయం వాపు తీవ్రతను
తగ్గిస్తాయి. స్ర్తిలకు సంబంధించిన పలు సమస్యలకు గోరింటాకు, పూలు, కాయలు, బెరడు.. అన్ని ఉపయోగకరమే అయితే వైద్యుల సలహా అవసరం.
పండగలు, పర్వదినాలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తుంది. వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుకుంటాం. ఈ డిజిటల్ కాలంలో మెహిందీ డిజైన్లలో ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి.

-హర్షిత