AADIVAVRAM - Others

ఆజానుబాహు అక్వేరియం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం అక్వేరియం చూడాలంటే భూమిపై నిలబడే చూస్తాం. కాస్త పెద్దదైతే తలెత్తి చూస్తాం. కానీ బెర్లిన్‌లోని రాడిసన్ హోటల్‌లో ఉన్న అక్వేరియంను చూడాలంటే మాత్రం ఏకంగా లిఫ్ట్ ఎక్కాల్సిందే! ఎందుకంటే ఇదేమీ ఆషామాషీ అక్వేరియం కాదు. 82 అడుగుల పొడవున విస్తరించి ఉందీ అక్వేరియం. ఇలాంటి అక్వేరియాన్ని మామూలుగా ఎలా చూడగలం? అందుకే హోటల్ వాళ్ళు ఈ అక్వేరియాన్ని చూడటానికి అనువుగా, పై అంతస్తులకు చేరడానికి ఈ సిలిండ్రికల్ అక్వేరియం మధ్యలోంచి లిఫ్ట్‌ను పెట్టారు. పై అంతస్తులకు చేరుకోవాలని అనుకునేవారు ఎంచక్కా లిఫ్ట్ ఎక్కడంతో పాటు చుట్టూ ఉన్న అక్వేరియాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ అక్వేరియంలో 97 జాతులకు చెందిన 1500 చేపలున్నాయి. ఇందులో నీటిని నింపేందుకు పెద్ద సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియం తయారీకి అక్రిలికిల్ గ్లాస్‌ను ఉపయోగించారు. 2004లో స్థానిక ఇనె్వస్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గింప్ దీన్ని డిజైన్ చేసిందట. దీని తయారీకి 12.8 మిలియన్ యూరోలు ఖర్చయ్యిందట. ఇప్పుడు ప్రపంచంలోని అతి పెద్ద సిలిండ్రికల్ ట్యాంక్ అక్వేరియం ఇదే.. అంతేకాదండోయ్.. అతి పెద్ద టనె్నల్స్ ఉన్న అక్వేరియం కూడా ఇదే మరి! దీనిని రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు శుభ్రం చేస్తారు. రోజూ నలుగురు డైవర్లు చేపలకు ఆహారం అందించడం నుంచి క్లీన్ చేసేవరకు అన్ని పనులను చూసుకుంటారు. అక్వేరియం అంటే పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అక్వేరియంలో కదలాడుతున్న చేపలను చూడటం వల్ల ఒత్తిడి దరిచేరకుండా మనసు హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఈ అక్వేరియం పెట్టినప్పటినుండి ఆ ఫైవ్ స్టార్ హోటల్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన అక్వేరియం కదా మరి!!