Others

జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ సినిమా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగా ఓ సామాన్యుడి స్థాయి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పాలి. బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నుండి అనుకోకుండా దర్శకుడు తేజ తప్పుకోవడంతో సినిమా ఆగిపోతుందా అని అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా మరో దర్శకుడు క్రిష్ రంగంలోకి దిగడంతో ఈ సినిమా వస్తుందన్న ఆనందం అభిమానుల్లో కలిగింది. జూలై 5 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారట. పైగా విడుదల తేదీని కూడా చారిత్రక డేట్‌ను ఎంపిక చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 9. అందుకే ఈ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయాలని బాలయ్య ప్లాన్ చేశాడు.