Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకనుకోవాలంటే- సూర్యుడి ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న గడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. దీనే్న మరో రకంగా తిప్పి చెప్పుకుంటే, సృష్టి ప్రారంభ కాలంలో ఏ గ్రహం ప్రభావం అమలులో వుందో, ఆ గ్రహం పేరే- ఆదిత్యుడు, అనగా మొదటివాడు. అదే మొదటిరోజు! అందువల్ల ఆ రోజు ఆదివారము అవుతుంది. ఆదివారమన్నా ఆదిత్యవారమన్నా ఒకటే. అక్కణ్నించి ఒక హోరకు ఒక గ్రహంగా ఇపుడు చెప్పుకున్న ‘మందామరేఢ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః’ అనే వరసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాల్గవ గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజూ ఇలాగే సాగుతుంది. ఆ లెక్క ప్రకారం సూర్యోదయ హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది. అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.
ఈ విధంగా ఆకాశంలో వుండే గ్రహాల వరస వేరు, వారాల వరస వేరు అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాళ్టి వైజ్ఞానిక లోకానికి కూడా ‘‘ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి’’ అనే విషయం తెలియదు. అది భారతీయ మహర్షులకే తెలుసు!
ఈ లాజిక్ మరిచిపోయినా ఇతర భూఖండాలన్నీ ఇదే వారక్రమాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఆ వరసతోపాటు ఆ లాజిక్ కూడా ఇంకా సజీవంగా వుంది. ఎందుకంటే ఈ విజ్ఞానానికి ఇది పుట్టినిల్లు. అందరికీ ఈ విద్యను పంచి ఇచ్చిన పాఠశాల కనుక!
ఇంతకూ తేలిందేమిటంటే- భూమి తన చుట్టూ తాను ‘ఏకవారం’ అనగా ‘ఒకసారి’ తిరిగి వచ్చే కాలం పేరు ‘వారం’! భూమి ఒకసారి తన చుట్టూ తను తిరగటమంటే- భూమి తన ఇరుసు (యాక్సిస్) చుట్టూ 360 డిగ్రీలు తిరుగుతుందన్నమాట.

ఉదయాస్తమయాలు
మనం భూమిమీద ఒక ప్రాంతంలో వున్నాం. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతానికి సున్న డిగ్రీల స్థానం అనుకుందాం. అపుడు సున్న నుంచీ 180 డిగ్రీల వరకు సూర్యుడు మనకు కనిపిస్తాడు. అది మనకు పగలు. 181వ డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి సూర్యుడు మనకు కనిపించటం మానేస్తాడు. సూర్యుడు అస్తమించాడు అంటాం మనం. 181 నుంచీ 359 డిగ్రీ వరకు మనకు సూర్యుడు కనిపించడు. మనకది రాత్రి. 360వ డిగ్రీ దగ్గర మళ్లీ మనకు సూర్యుడు కనిపించడం మొదలుపెడతాడు. సూర్యుడు ఉదయించాడంటాం మనం. కనుక, సూర్యోదయంగాని, సూర్యాస్తమయంగాని, మన చూపులకి వున్నాయే గానీ, నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడా, అస్తమిస్తున్నాడా? లేదే! అలాంటప్పుడు సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు అని పెద్దలంతా అంటారెందుకు?
పెద్దలలా అనలేదు; పిన్నలే అంటూ వుంటారు. పెద్దలు ఒక్కోసారి వౌనంగా వూరుకుంటూ వుంటారు. చూడండి-
ఐతరేయ బ్రాహ్మణం-
‘‘న కదా చ నాస్తమేతి నోదేతి’’ అంటోంది.
విష్ణుపురాణం ఆ మాటను ఇంకా స్పష్టంగా చెపుతోంది.
నైవాస్తమన మర్కస్య నోదయ స్సర్వదా సతః
ఉదయాస్తమనాఖ్యం హి దర్శనాదర్శనం రవేః
(సర్వకాలాలలోనూ ఏకరూపంగా వుండే సూర్యుడికి ఉదయంగానీ, అస్తమయంగానీ లేవు. సూర్యుడు కనిపించటాన్ని ఉదయం అంటున్నారు. కనిపించకపోవటాన్ని అస్తమయం అంటున్నారు.)
ఐనా సరే, లోక వ్యవహారాన్ని బట్టి- సూర్యోదయ సూర్యాస్తమయాలను అంగీకరించి మన పెద్దలు మాట్లాడుతూ వుంటారేగానీ తెలియక కాదు.
ఇంతకూ- భూమి మీద మనం ఉన్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. కనుక మనం కూడా కుమ్మరి చక్రంమీద నిలబడిన చీమలాగా, భూమితోపాటు, మనకు తెలియకుండానే ఆకాశంలో ఒక చుట్టు తిరుగుతున్నాం. ఆ విధంగా మనం భూమితోపాటు సున్న నుంచి 360 డిగ్రీల ఒకసారి తిరిగి ఒకసారి భూప్రదక్షిణం చేసినట్లవుతుంది. అంటే, మనకు ఒక వారం (సారి) పూర్తవుతుంది.
ఇలా భూమి తన చుట్టూ ఒక వారం- ఒకసారి తిరిగేసరికి, ఆ తల్లి సూర్యుడి చుట్టూ తిరిగే పరిధిలో ఒక డిగ్రీ ముందుకు జరుగుతుంది. అంటే- 360 సార్లు ఆత్మప్రదక్షిణం చేసుకుంటే, భూదేవి, ఒక సూర్యప్రదక్షిణం చేయగలుగుతుంది. అంటే 360రోజులు జరిగితే- ఒక సూర్యప్రదక్షిణం అవుతుంది.
మరి మనం రోజుల్ని లెక్కించుకోవాలంటే ఏం చెయ్యాలి?
నక్షత్రాలమీద ఆధారపడదామా అంటే- అవి ఆకాశంలోని భూచక్రాన్ని 27 ముక్కలు చేస్తున్నాయి. కనుక భూమి యొక్క 360 డిగ్రీలు రోజుకు సరిపోవు. అవి సరిపోకపోతే తిథులూ సరిపోవు, యోగాలూ సరిపోవు, కరణాలు సరిపోవు. మరెలా?
వీటన్నింటిలోనూ కొంత దగ్గరగా వుండేవి తిథులు- అవి 15. వాటిని సగం చేస్తే వచ్చేది ఏడున్నర. దాన్ని ఇటు 7 దగ్గరకు గాని, అటు 8 దగ్గరకుగానీ గుండ్రంగా తిప్పాలి. ఎటువైపు జరగటం మంచిది? ఇక్కడే మన మహర్షుల విజ్ఞాన నిష్ఠ మనకు తెలిసేది.
భూమి భ్రమిస్తోందంటే, ఈ భ్రమణానికి ప్రధానకారకులెవరు? అంటే 7 గ్రహాలే అని మన మహర్షులకు తెలుసు. ఈ 7 గ్రహాల ప్రభావాలే భూభ్రమణాన్ని, మానవ జీవితాలలో ప్రధాన సంఘటనలనూ కూడా శాసిస్తున్నాయి. అందువల్ల భూ పరిభ్రమణాలను 7 సంఖ్యతో గుణించటమే ఉచితమని మన మహర్షులు నిర్ణయించారు.

ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి