Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే వారాలను మన మహర్షులు గ్రహాల పేర్లతోనే పిలిచారు. ఐతే వారాల వరస నిర్ణయించటంలో మన మహర్షులు అనుసరించిన లాజిక్ కేవలం గ్రహగోళాలమీద ఆధారపడి లేదు. అది గ్రహదేవతల తత్త్వాలమీద కూడా ఆధారపడి వుంది.
ఈ సృష్టి మొత్తం కలిపి సూర్యచంద్రాత్మకం అని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని వివరించాలంటే- చాలా వుంది. ప్రస్తుతానికి ఆ విషయాన్ని ఒప్పేసుకొని ముందుకు పోదాం. సృష్టికి ప్రతిబింబం ఆకాశంలో వుండే ద్వాదశ రాశిచక్రం. అదే భూచక్రం. దీనిలో 12 రాశులున్నాయి. వీటన్నింటి మీదా ప్రధానాధిపత్యం సూర్యచంద్రులదే. అంటే- మానవ జీవితాలమీద ప్రధాన ప్రభావం చూపించేది సూర్యచంద్రులే. వీరే తండ్రి తల్లులు. కానీ, వాళ్ళిద్దరూ కూడబలుక్కొని, సూర్యుడు సింహాన్నీ, చంద్రుడు కర్కాటకాన్ని తమ ఆధిపత్యం కింద వుంచేసుకుని, మిగిలిన 5 గ్రహాలకీ- ఒక్కొక్కరికీ రెండేసి రాశుల వంతున పంచేశారు. సూర్యుడికి చాలా దగ్గరగా వుండేవాడు బుధుడు. సూర్యబుధుల మధ్య దూరం- 4 కోట్ల మైళ్లు (సుమారు). అందువల్ల అతనికి మిథున కన్యలు దక్కాయి. తరువాత సూర్యుడికి సన్నిహితుడు శుక్రుడు. 6 కోట్ల 70 లక్షల మైళ్లు- వాళ్ల మధ్య దూరం. అందువల్ల ఇతనికి వృషభ తులలు దక్కాయి. కుజుడు సూర్యుడికి 14 కోట్ల 16 లక్షల మైళ్లు దూరంవాడు. అందువల్ల ఇతనికి మేష వృశ్చికాలు ఇచ్చేశారు. గురువు సూర్యుడికి 48 కోట్ల 33 లక్షల మైళ్ళు దూరంవాడు. ఈయనకు ధనుర్మీనాలు దక్కాయి. శని సూర్యుడికి 88 కోట్ల 62 లక్షల మైళ్ళ దూరంవాడు. ఇతనికి మకర కుంభాలు లభించాయి. ఈ ఏర్పాటంతా దూరాన్ని బట్టి జరిగింది. భూమి సూర్యుడికి 9 కోట్ల 29 లక్షల మైళ్ళు దూరంలో వుంది. అంటే భూమి శుక్ర కుజుల మధ్యలో వుంది.
ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి గనుక, భూమి దగ్గర నుంచి వాటి దూరం స్థిరంగా వుండదు. కనుక, భూమి మీద నిలబడి వారాల వరుసను నిర్ణయించే మహర్షులు- ఈ దూరాలను లెక్కలోకి తీసుకోలేదు. వాటి ప్రభావాలు భూమిమీద పడే పద్ధతిని పరిశీలించి, దాన్ని బట్టి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అనే క్రమాన్ని నిర్ణయించారు.
ఇదే వరుసను అన్ని దేశాలూ అనుసరిస్తున్నాయి గనుక, ఒకానొక పూర్వకాలంలో భూమి అంతటా వేద సంస్కృతే వ్యాపించి వుండేదని ఊహించవచ్చునేమో!
ఐతే కొందరు ఆధునిక పరిశీలకులు, వేదంలో వారాల ప్రసక్తి ఎక్కడా లేదనీ, ఇవి గ్రీకుల నుంచీ మనకు సంక్రమించిందనీ భావిస్తున్నారు. మరి కొందరు వేదాలలో కనిపించే ‘వాసర’ శబ్దానికి వారమనే అర్థమనే వివరిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ వారాలు పురాణకాలం కంటే ముందే మన దేశంలో వచ్చాయనటం నిర్వివాదాంశం.
ఈ విధంగా పురాతన భారతీయుల అపార ఖగోళ విజ్ఞాన పరిశోధనలకు ఫలితంగా రూపొందిన తిథి, నక్షత్ర, యోగ, కరణ, వారాలనే పంచ అవయవాలు గల గ్రంథమే పంచాంగం.
6. కాలమానములు
మనకు మనిల్లే పెద్దది...! దానికంటే వూరు, దానికంటే మనసీమ, దాని కంటే మన దేశం, దాని కంటే భూగోళం, ఆ తర్వాత ఆకాశం-ఇటు పిపీలికం మనిషి- అటు అంతులేని అంతరిక్షం! అయినా మనిషి ఈ విశ్వాంతరాళాన్నీ, ఇందులోని గోళాలనూ, వాటిమధ్య దూరాలనూ కొలిచే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం పెరిగి రోదసీ నౌకలు, రోదసీ ప్రయాణాలు, పరిశోధనలు కొనసాగుతూనే వున్నాయి. కానీ అమీ-తుమీ తేలటం లేదు ఆధునిక ఖగోళ శాస్తవ్రేత్తలు ఏమైనా సరే, ఈ విశ్వం అంతు చూడాలనుకున్నారు.
అందుకని ఖగోళ వేధశాలల్లో సుదూరదర్శన యంత్రాల పరిధిని విస్తరించుకుంటూ పోయారు. వంద అంగుళాల వౌంటి విల్సన్ అబ్జర్వేటరీ స్థాపించారు. ఇది 50 కాంతి సంవత్సరాల దూరం చూపిస్తుంది. కాలిఫోర్నియాలోని పరమోర్‌లోగల రెండువందల అంగుళాల డయామీటరు గల వేధశాల ద్వారా ఆకాశంలో 2 పక్కన 11 సున్నాల మైళ్ళ దూరం చూడవచ్చు. అంటే ఇరవై వేల కోట్ల మైళ్లు.
అయినా శాస్తజ్ఞ్రులను ఎంత దూరం విశ్వాన్ని చూశావయ్యా అంటే- బిక్కమొహం వేస్తున్నారు. ఈ పెద్దపెద్ద లెక్కలకోసం ‘‘కాంతి సంవత్సరం’’ అనే కొలమానం ఒకదాన్ని ఖగోళ శాస్తవ్రేత్తలు ఏర్పరచుకున్నారు.
ఒక కాంతి సంవత్సరం అంటే (కాంతి వేగం సెకనుకు 186000 మైళ్ళు గనుక) - 186000 తి 60సె. తి 60ని..తి 24 గం. తి 365 రో.- మైళ్లు. అంటే సుమారు ఆరు లక్షల కోట్ల మైళ్లు. ఈ లెక్క ప్రకారం, మనకు ప్రాణదాత అయిన సూర్యుడి వెలుగు మన భూమికి చేరటానికి సుమారు ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పడుతుంది. అనగా సూర్యుడు మనకు తొమ్మిది కోట్ల ముప్ఫై లక్షల మైళ్ల దూరంలో వున్నాడు. కాని ఆయనకు అవతలగా విశ్వంలో వుండే ఇతర నక్షత్రాలు ఇంత దగ్గరలో లేవు.
మన సూర్య కుటుంబానికి చెందిన నక్షత్రాల్లోని కొన్ని 200 కోట్ల మైళ్ల దూరంలో వున్నాయట! సూర్య కుటుంబానికి అవతల గ్రహవేధశాలల్లో కనిపించేటంతవరకు దూరాలు లెక్కవేసుకున్నా- మన రోదసి వ్యాసం సుమారు 35 బిలియన్ల లైట్ ఇయర్స్; అనగా ‘21’ వేసి, దానిపక్కన ఇరవైరెండు సున్నాలు పెట్టుకొంటే - అన్ని మైళ్లు. ఇంత వ్యాసంలో వుండే రోదసిలోని గ్రహగోళాల గురించే మనకు కించిత్తు అయినా అంతు దొరకటం లేదు సరికదా-

ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి