Others

పోషకాహార లేమితో శుష్కించిపోతున్న బాల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన పోషకాహారం లభించక దేశ వ్యాప్తంగా 2.3 కోట్ల మంది పిల్లలు (ఆరేళ్ల లోపు వయసువారు) అనారోగ్యం బారిన పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సమగ్ర శిశు సంక్షేమ పథకం’ (ఐసిడిఎస్) కింద అంగన్‌వాడీలు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ 28 శాతం మంది పిల్లలు పోషకాహారానికి నోచుకోవడం లేదు. బీహార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో పోషకాహార లేమితో లక్షలాది మంది పిల్లలు వ్యాధుల బారిన పడుతూ నీరసించి పోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, సిక్కిం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తమిళనాడులో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. దేశ వ్యాప్తంగా ఆరేళ్లలోపు వయసు కలిగిన పిల్లల్లో 28 శాతం మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. శారీరకంగా నీరసించి పోవడం, వయసుకు తగ్గ బరువులేక పోవడం, పలు రకాల అనారోగ్య లక్షణాలతో వీరు బాధపడుతున్నారు. బీహార్‌లో అయితే ఆరేళ్లలోపు పిల్లల్లో దాదాపు 50 శాతం మంది తక్కువ బరువు కలిగి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 37 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 36 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో 35 శాతం, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో 32 శాతం చొప్పున పిల్లలు పోషకాహారం లేక దీనావస్థలో కనిపిస్తున్నారు. ఢిల్లీలో దాదాపు ఏడు లక్షల మంది పిల్లలు అంగన్‌వాడీలకు వెళుతున్నా 35 శాతం మంది రోగాలను ఎదుర్కొంటున్నారు. పేదరికం, సరైన పోషకాహారం అందకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పెద్ద రాష్ట్రాలతో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, సిక్కింలకు సంబంధించి పిల్లలు ఆరోగ్యవంతంగానే కనిపిస్తున్నారు. కాగా, మూడేళ్లలోపు పిల్లల విషయంలో పోషకాహార లోపం గురించి సరైన సమాచారం అందుబాటులో లేదని అధికారులు అంగీకరిస్తున్నారు. అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు సంబంధించి మాత్రమే ఇటీవల అధ్యయనం చేశారు. 2005-06లో జరిపిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ ప్రకారమైతే 40 శాతం మంది పిల్లలు తగిన పోషకాహారానికి నోచుకోవడం లేదని తేలింది. దేశం మొత్తమీద ఆరేళ్ల లోపు వయసు కలిగిన పిల్లల సంఖ్య 16 కోట్లు దాటినట్లు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. వీరిలో దాదాపు సగం మంది మాత్రమే అంగన్‌వాడీలకు వెళుతుంటారు. అంగన్‌వాడీల్లో నమోదయ్యే పిల్లల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతున్నా, దాదాపు 30 శాతం మందికి తగిన పోషకాహారం అందడం లేదు.