Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోక కూడా దొరకటం లేదు! పోనీలే ఈ నాడు కాకపోతే మరో పదేళ్ల తర్వాతైనా శాస్ర్తియ విజ్ఞానం అభివృద్ధి చెంది- ‘‘ఖగోళం’’లోని గ్రహగోళాలు అన్నింటినీ లెక్కప్రకారం ‘‘సర్వే’’చేసి తెలుసుకోగలం- అని అనుకుందాం అనుకుంటే-
మన ఖగోళ శాస్తజ్ఞ్రుల లెక్క ప్రకారం ప్రతి 1300 నుంచి 2000 మిలియన్ సంవత్సరాలకు ఈ విశ్వం రెట్టింపుగా వ్యాకోచిస్తోంది! (ఒకరు 1300 అన్నారు మరొకరు 2000 అన్నారు.) ఇదిలా వ్యాకోచించటం ప్రారంభించింది రెండు బిలియన్ల సంవత్సరాల నుంచే నట (అంటే 2000 కోట్ల సం.లు)!
ఈ విషయాలను మన నోబెల్ బహుమతి గ్రహీతలైన శాస్తజ్ఞ్రులు చెబుతుంటే మనకు ఆశ్చర్యంగా వుంటుంది గదా! కానీ ఈ విషయాలనే మనవాళ్లు ఎప్పుడో మనకు చెప్పారు. పురుష సూక్తంలో-
‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదాస్య అమృతం దివి’’ -అని వుంది.
అంటే ‘విరాట్ పురుషుడిలో మూడు పాదాలు అసలు ఎవరికీ కనపడవు. ఒక్క పాదమే ఈ విశ్వంగా వ్యాప్తమైవుంది’’. (పాదము అనగా నాలుగోవంతు.)
దీనినిబట్టి మనకు కనిపించే విశ్వంకన్నా కనిపించని విశ్వం ఇంకా ఎక్కువ వుందని వేదర్షులు స్పష్టం చేస్తున్నట్లే గదా.
ఇక కనిపించే విశ్వభాగంలో కాలమానపు కొలతల గురించి ఆధునిక విజ్ఞానం చెప్పేదానికీ, మన సనాతన మహర్షులు చెప్పినదానికీ, ఏమైనా పోలిక వున్నదా, లేదా? - అనే విషయాన్ని పరిశీలిద్దాం.
మన సాంప్రదాయిక పంచాంగాలలో సృష్ట్యాదినుంచీ ఇప్పటివరకు గడచిన సౌరమాన సంవత్సరాలకు క్రమంతప్పకుండా గుణించుకుంటూ వస్తున్నారు. మన పంచాంగాలలో పీఠికాభాగంలో ఆ లెక్కలు కనిపిస్తూ వుంటాయి.
ఆ లెక్క ప్రకారం (క్రీస్తుశకం 2009 ఏప్రిల్ నాటికి, ఈ శే్వత వరాహ కల్పం ప్రారంభమై 195కోట్ల 58 లక్షల 85 వేల 110 సంవత్సరాలు గడిచాయి. దీనినే రెండువందల కోట్ల సంవత్సరాలని నవీన ఖగోళ శాస్తజ్ఞ్రులు ఉజ్జాయింపుగా చెబుతున్నారు.
ఈ విశ్వం ఒక నీటి బుడగ వంటిదని, అది పెరిగి పెరిగి ఎప్పటికో అప్పటికి పగిలిపోతుందనీ, అలా పగిలినాక, అది మళ్లీ కొంచెం వృద్ధిపొంది చుక్కల రూపానికి వస్తుందనీ ఎడింగ్‌టన్ అన్నాడు కానీ, దీనే్న డచ్ దేశీయుడు డి.సిట్టర్ అనే వైజ్ఞానికుడు మరింత వివరంగా చెప్పాడు. కానీ- అలా పగిలే సమయం ఏదో వైజ్ఞానికులు చెప్పలేకపోతున్నారు. మన మహర్షులు ఈ విషయంలో కూడా కచ్చితమైన లెక్కలను చెప్పారు. దానికోసం వారు కల్పము అనే కాల విభాగాన్ని రూపొందించారు. సృష్టికర్తకు మనకున్నట్లుగానే పగళ్ళూ, రాత్రులూ ఉంటాయనీ, ఆ పగళ్లలో సృష్టి వికసిస్తూ మనకున్నట్లుగానే పగళ్ళూ, రాత్రులూ ఉంటాయనీ, ఆ పగళ్లలో సృష్టి వికసిస్తూ వుంటుందనీ, ఆ రాత్రులలో సృష్టి అంతరించి పోతుందనీ వారు కవితామయంగా చెప్పారు. ఒక సృష్టి ఉదయించిన దగ్గర్నుంచీ అంతరించిపోయేదాకా ఉండే సమయాన్ని, 432కోట్ల మానవ సంవత్సరాలుగా వారు లెక్కించారు. ఇది సృష్టికర్తకు పగలు. దీని పేరే కల్పము. మళ్ళీ యింత సమయమే సృష్టికర్తకు రాత్రి కాలంగా వుంటుందనీ, ఆ సమయంలో సృష్టికి రూపురేఖలు ఉండవనీ, వారు నిగ్గు తేల్చారు. ఈ విషయంలో ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం ఇంతవరకూ ఏ నిర్ణయానికీ రాలేకపోతోంది.
మన మహర్షులు చెప్పిన లెక్కల ఆధారంగా నవీన పరిశోధనలు చేస్తే, ఆ లెక్కల సత్యాలు మరింత విస్పష్టం కావచ్చు.
ఒక కల్పం అంటే 432కోట్ల సంవత్సరాలని, మన మహర్షులు ముద్ద అంకెగా చెప్పి వెయ్యలేదు. వారీ అంచనాకు రావటానికి హేతుబద్ధమైన కాలగణన విధానం వారిదగ్గర వుంది. నిజానికి అది చాలా సంక్లిష్టమైన గణితప్రక్రియ.
మనం యిప్పుడు దాని లోతుల్లోకి పోకుండా, దాని స్థూల స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
కాలమానం
కాష్ఠా పంచదశ ఖ్యాతా నిమిషా మునిసత్తమ
సాష్టాత్రింశత్ కళా, తాస్తు త్రింశ న్మౌహూర్తికో విధిః
తావత్ సంఖ్యైరహోరాత్రం ముహూరె్తైర్మానుషం స్మృతం
అహోరాత్రాణి తావంతి మాసః పక్షద్వయాత్మకః
తైః షడ్భిరయనం వర్షం ద్వే యనే దక్షిణోత్తరే
దివ్వైర్వర్ష సహస్రైస్తు కృతత్రేతాది సంజ్ఞితమ్
చతుర్యుగం ద్వాదశభి స్తద్విభాగం నిబోధ మే
దివ్యాబ్దానం సహస్రాణి యుగేష్వాహుః పురావిదః
కృతం త్రేతా ద్వాపరం చ కలి శ్చైవ చతుర్యుగం
ప్రోచ్యతే తత్ సహస్రం చ బ్రహ్మణో దివసం మునే
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి