Others

వాయిదా - వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-భరీ మూల్యం చెల్లించక తప్పదు
వాయిదాల మీద వాయిదాలతో
అసలు సంగతి మరచినపుడు

- సోమరి తనానికి
ప్రధాన లక్షణం వాయిదా
విద్యార్థి చదువు వాయిదా వేస్తే
సప్లిమెంటరి అవుతుంది
బాకీవారు వడ్డీ వాయిదా వేస్తే
చక్రవడ్డీ అవుతుంది

-తొందరేముంది చేద్దాంలే అంటాం
ఆయువులో అధికంగా
ఒక్క శ్వాస కూడా సంపాదించలేం
మృత్యువు మరణ ఘడియలను
వాయిదా వేయదు ఎప్పుడూ..
జీవితంలో ప్రతి క్షణం ముఖ్యమైనదే
సద్వినియోగం చేసుకోవడం
వివేక వంతుని లక్షణం

- విలువైన సమయాన్ని
వృథా చేస్తూ బ్రతికేవారికి
పశు, పక్షాదులకు పెద్ద తేడా ఉండదు
భౌతికంగా చేయడానికి ఏమీ లేకున్నా
అంతర్యామి వైపు నడిపించాలి
మనస్సు అవుతుంది సుఖాంతం

-బ్రహ్మ సృష్టికర్త అయితే
కవి, రచయిత కళాకారులు
సృజనకారులు

-్భతికంగా చేసే కృషికన్నా
మానసికంగా చేసే భావనాత్మక కృషి
ఎన్నో రెట్లు అధికం
వాటిని చెదిరిపోకుండా
పదిల పరిస్తే అవుతాయి
అద్భుత కళా ఖండాలు
వాయిదా వేస్తే
అవుతాయి చెదిరిన కళలు

-ఉషశ్రీ తాల్క