Others

దేశమంటే ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంటే మన ఇల్లు
మనకి నీడనిచ్చే వాకిలి
మనమంతా ఒక్కటనే భావనను చిదిమేసే
దుర్మార్గులని శిక్షించక వదిలేస్తే
దేశానే్న మింగేస్తారు
సొంత లాభం కోసం కన్నతల్లి
గుండెల మీద గుద్దులు గుద్ది హింసించే
నరరూప రాక్షసులను తరిమికొట్టాలి
మంచిని వక్రించే మహా చమత్కారుల
చేతలను మొగ్గలోనే తుంచెయ్యాలి
పట్టి పీడించే చీడపురుగుల్లా వాళ్లను
నలిపి పారెయ్యాలి
తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే
తలతిక్క సన్నాసుల దుష్ట చర్యలను దునిమేయాలి
అమ్మకి ద్రోహం తలపెట్టిన కొందరు బిడ్డల నుండి
మిగిలిన సంతతి అమ్మను కాపాడాలి
అయిన వారయినా దుర్మార్గం తలపెడితే
అమ్మని రక్షించుకోవాలి.
కులం పేర మతం పేర
విద్వేషాలు సృష్టించి
దేశాన్ని ముక్కలు చెయ్యాలనుకునే వారినీ
వాళ్ల ఆలోచనలను చిత్తుచెయ్యాలి
అమ్మ ఋణం తీర్చుకోవాలి
మనుషులను కాదు చంపడం
మనస్తత్వాలను చంపాలి!
*

-శారదా అశోకవర్థన్ 04027803666