Others

అవనిలో దైవం - అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ॥ నమ్మని నాస్తికాళికిని, నమ్మిక పుట్టక దైవమందునన్
కమ్మని భావజాలముల, గమ్మున మానస వీధులందునన్
గ్రమ్మగ జేయగా దలచి, రంజిలు జ్ఞాన విశేష బుద్ధిచే
‘అమ్మ’ను సృష్టిచేసె, పరమాత్ముడు ధారుణి చక్రమందునన్

కం॥ ‘మమీ’యను మృత శబ్దము
అమ్మను పిలువంగ నెట్లు, అనువుగ నుండున్
‘అమ్మా!’యను పిలుపువినగ
అమ్మమ్మల మనము సైత మానందించున్

ఆ.వె॥ భూషలొసగువారు, భూము లొసగువారు
కలిమి నొసగువారు, కలరుగాని
తనదు దేహమందె, తగిన గేహమొసగు
తల్లికన్న వేరు త్యాగి గలదె
*

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846969