Others

సంతోషం నీవెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషం!
ఎక్కడ దొరుకుతుంది
సంతోషం? సమాధానం
కొంచెం కష్టం

బొమ్మలతో
స్నేహితులతో ఆడుకోవడం
పిల్లలకు సంతోషం

ఆటపాటలతో
గడపడం
ఎదిగే పిల్లలకు
సంతోషం
తాము కన్నకలలను
సాకారం చేసుకోవడం
యువతకు సంతోషం

సంతానాన్ని చక్కగా
చూసుకోవడం తల్లిదండ్రులకు
సంతోషం

ప్రకృతి ఆరాధన,
తీర్థయాత్రలు చేయడం,
సృజన చేయడం....
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన
సంతోషం
పరిమిత సంపాదనతో
కలిగిన దాంట్లో
ఏ ఆర్భాటం లేకుండా
ఉండడం కొందరికి
సంతోషం

పూరి గుడిసెలైనా
కఠిన నేలపైన
హాయిగా నిద్రించడం
సంతోషం కొందరికి

హంసతూలికా తల్పాలన్నా
ముళ్ళపాన్పు అన్నట్లు
నిద్ర కరవై దుఃఖ
జీవితం గడుపుతారు
సంతోషం కరువై కొందరు

డబ్బు సంతోషాన్నిస్తుందా!
సౌఖ్యాన్ని మాత్రమే ఇస్తుంది
అనేది నగ్నసత్యం
అధికారం ఉంటే
సంతోషాన్నిస్తుందా!
ఎల్లవేళల సంతోషంగా
ఉన్న దాఖలాలు కరువు

అందం సంతోషాన్నిస్తుందా?
మానసిక క్షోభకు గురై
ఆత్మహత్యలు చేసుకున్నట్లు
చరిత్ర చెబుతుంది

సకల విద్యలను
ఆర్జించితే సంతోషంగా ఉంటారా?
ఎందరో విజ్ఞాన మహానుభావులు
అశాంతితో చాలించారు తనువును

నీతిమంతమైన జీవితం
అవసరమైన మేర సంపాదన
అందరితో ఆత్మీయంగా ఉండడం
అవసరమైన వారికి చేతనైన సహాయం
తిరిగి ఏమి ఆశించకుండా చేయడం
ఎంతో సంతోషం

-ఉషశ్రీ తాల్క